Sun Smiling: ప్రపంచానికి వెలుగునిచ్చే దేవుడు సూర్యుడు. సూర్య భగవానుడిని ఆదిత్యుడని కూడా అంటారు. ఆంగ్లేయులు మన దేశానికి రాక ముందు ఆదివారం సెలవు ఉండేది కాదు. ఆదివారం మాంసాహారం తినేవారు కాదు. ఆ రోజును సూర్యుడి రోజుగా భావించి ఆదిత్య హృదయం చదువుకునే వారు. మద్యం, మగువ, మాంసం తినేవారు కాదు. ఇంకా ఆదివారం గోళ్లు తీసుకోకూడదు. వెంట్రుకలు తీయకూడదు. స్వాతంత్ర్యానికి పూర్వం మనం భక్తిశ్రద్ధలతో ఆదివారం నిష్టగా ఉండేవారు. ఆంగ్లేయుల రాకతో దేశంలో ఆదివారం సెలవు ప్రకటించి ఆ రోజు మాంసం తినేలా అలవాటు చేశారు. దీంతో మన నియమ నిష్టలు దారి తప్పాయి. అంతకుముందు అమావాస్య, పౌర్ణమికే సెలవులు ఉండేవి.

సూర్యుడు కచ్చితమైన సమయాలు పాటిస్తూ వెలుగును ఇస్తుంటాడు. దీంతో ప్రపంచం సూర్యుడి వెలుగులోనే మనగలుగుతోంది. ఈ నేపథ్యంలో సూర్యుడి వెలుగును ఆస్వాదిస్తూ తరిస్తుంటారు. శాస్త్రవేత్తలు చంద్రుడి వద్దకు మాత్రం వెళ్లినా సూర్యుడి దగ్గరకు మాత్రం వెళ్లలేకపోయారు. అక్కడ ఉండే వేడికి సూర్యుడి దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడింది. తరువాత రోజు సూర్యుడు నవ్వుతున్నట్లుగా ఉండే ఫొటోను నాసా విడుదల చేసింది. దీంతో శాస్త్రవేత్తలు వివరణ ఇస్తున్నారు.
గ్రహణం తరువాత రోజు సూర్యుడు నవ్వుతున్నట్లుగా కనిపించే ఫొటోను చూసి అందరు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను నాసా షేర్ చేయడంతో అందరు వింతగా చూశారు. సూర్యుడి ఉపరితలంపై నల్లగా కొన్ని ప్యాచెస్ ఉండటంతో అది చూడటానికి నవ్వుతున్నట్లుగా కనిపించడం సహజమే. వీటిని కొరొనల్ హోల్స్ అంటారు. దీంతో సూర్యుడి ఫొటోను చూసి నెటిజన్లు కూడా ఆతృత వ్యక్తం చేశారు.

కొరొనల హోల్స్ నుంచి సోలార్ విండ్స్ స్పేస్ లోకి చొచ్చుకు వెళ్తాయని నాసా వెల్లడిస్తోంది. సూర్యుడు నవ్వుతున్నట్లుగా కనిపించే ఫొటోతో అందరు ఆశ్చర్యం వ్యకతం చేశారు. నల్లగా ఉండే ప్యాచెస్ తో సూర్యుడు నవ్వుతున్నట్లు గా అనిపించడంతో భానుడి ఫొటోతో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. సూర్యుడు నవ్వుతున్నట్లుగా కనిపించిన ఫొటో ప్రస్తుతం అందరిలో ఆసక్తి పెంచుతోంది. సూర్యుడి ఫొటోను శాస్త్రవేత్తలు సునిశితంగా ఆలోచిస్తున్నారు.