https://oktelugu.com/

Naresh- Ramya Raghupathi: నరేష్ పెళ్లికి ముందే నన్ను బెడ్ మీదకు రమ్మన్నాడు… మరో బాంబు పేల్చిన మూడో భార్య!

Naresh- Ramya Raghupathi: నరేష్ పై మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఆమె తాజా ఇంటర్వ్యూ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు నరేష్ ప్రకటించిన నేపథ్యంలో రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చారు. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ నందు సుదీర్ఘ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా… నరేష్ తనను పెళ్ళికి ఎలా ఒప్పించాడో ఆమె బయటపెట్టారు. నరేష్ నాకంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడు. కానీ మనిద్దరి మధ్య […]

Written By:
  • Shiva
  • , Updated On : January 8, 2023 / 11:44 AM IST
    Follow us on

    Naresh- Ramya Raghupathi: నరేష్ పై మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఆమె తాజా ఇంటర్వ్యూ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు నరేష్ ప్రకటించిన నేపథ్యంలో రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చారు. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ నందు సుదీర్ఘ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా… నరేష్ తనను పెళ్ళికి ఎలా ఒప్పించాడో ఆమె బయటపెట్టారు. నరేష్ నాకంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడు. కానీ మనిద్దరి మధ్య 12 ఏళ్ల బేధం మాత్రమే ఉందని అబద్దం చెప్పాడు. మన పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోక పోవచ్చు. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాడు.

    Naresh- Ramya Raghupathi

    పెళ్ళికి ముందే శృంగారం చేద్దామని అడిగాడు. కొంత కాలం పెళ్లి వద్దు సహజీవనం చేద్దామని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఎన్ని చెప్పినా నేను లొంగలేదు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోలేకపోతే చాలా మిస్ అవుతానని చెప్పాడు. ఆ మాటలు నా మనసు మార్చాయి. వివాహం చేసుకునేందుకు ఒప్పుకునేలా చేశాయి. తర్వాత మాకు అబ్బాయి పుట్టాడు. పవిత్ర లోకేష్ పరిచయం అయ్యాక నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. నన్ను వదిలించుకోవడానికి కుట్రలు చేశాడు.

    నాకు అక్రమ సంబంధాలు అంటగట్టేవాడు. చివరకు దేవుడు లాంటి కృష్ణగారితో నేను ఎఫైర్ పెట్టుకున్నానంటూ దారుణ వ్యాఖ్యలు చేశాడు.. అని రమ్య రఘుపతి కీలక ఆరోపణలు చేశారు. పవిత్ర-నరేష్ ల వివాహం జరగనీయనని రమ్య రఘుపతి శబధం చేస్తున్నారు. నేను నరేష్ కి విడాకులు ఇవ్వను. చట్టబద్ధంగా నాకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరో వివాహం చేసుకోవడం కుదరదు అన్నారు.

    Naresh- Ramya Raghupathi

    నా కొడుకు తండ్రి కావాలని అడుగుతున్నాడు. వాడి కోసమైనా నరేష్ కి విడాకులు ఇచ్చేది లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. నరేష్ మూడో వివాహంగా 2010లో రమ్య రఘుపతిని చేసుకున్నారు. కృష్ణ-విజయనిర్మలతో పాటు నరేష్, రమ్య కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. కొన్నాళ్ళు సవ్యంగానే వీరి కాపురం సాగింది. మరి రమ్య ఆరోపణలు పరిశీలిస్తే… చాలా కాలం నుండి పవిత్ర లోకేష్-నరేష్ మధ్య ఎఫైర్ నడుస్తుందని తెలుస్తుంది. రమ్య-నరేష్ విడిపోయి ఐదేళ్లు దాటుతుంది. అప్పటికే నరేష్ పవిత్ర లోకేష్ తో ఎఫైర్ మొదలుపెట్టాడని స్పష్టం అవుతుంది. రమ్య రఘుపతి సీరియస్నెస్ చూస్తుంటే ఈ వివాదం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు.

     

    Tags