Naresh – Pavitra Lokesh Marriage : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ అన్నంత పనిచేశాడు. తన మూడో భార్య రమ్య నుంచి విడాకులు పొందకుండానే.. ఇంకా కోర్టులో వారికి విడాకులు మంజూరు కాకుండానే ఏకంగా పవిత్రా లోకేష్ మెడలో మూడు ముళ్లు వేశారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లు సమాచారం. సంప్రదాయబద్దంగా పవిత్రమెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు నరేష్.
కొద్దిరోజుల కిందటే న్యూఇయర్ సందర్భంగా పవిత్రకు ఘాటు ముద్దు పెట్టి మరీ తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వీడియోను నరేష్ విడుదల చేసి సంచలనానికి తెరతీశాడు. ఆ తర్వాత ఆయన మూడో భార్య రమ్య దీనిపై మండిపడింది. విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే కేసు వేస్తానని హెచ్చరించింది.
ఇప్పుడు అన్నట్టుగానే నరేష్ ఏకంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పవిత్రను పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ మేరకు నరేష్ కొద్దిసేపటి క్రితం షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
ఇక పవిత్ర తన భర్తకు దూరంగా ఉంటోంది. మనస్పర్ధలతో విడిపోయింది. ఆమె విడాకులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని సమాచారం. ఇలా ఇద్దరూ విడాకులు తీసుకోకుండానే పెళ్లి పీటలెక్కడం..వీడియో రిలీజ్ చేయడం వైరల్ గా మారింది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) March 10, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Naresh pavitra lokesh marriage naresh pavitra lokesh entered into married life
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com