
Rajamouli On Oscar: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన అద్భుతాల కంటే డిజిటల్ మీడియా లో సృష్టించిన అద్భుతాలే ఎక్కువ.నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేసిన ఈ సినిమా అంతర్జాతీయ రేంజ్ లో రీచ్ ని సాధించింది.హాలీవుడ్ టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.అంతే కాదు రీసెంట్ గా ఈ సినిమాకి వరుసపెట్టి అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయి.
ఆస్కార్ అవార్డ్స్ లో కూడా నామినేషన్స్ దక్కించుకొని, అది గెలుచుకునేందుకు కేవలం ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది.అయితే ఆస్కార్ అవార్డ్స్ ఊరికే రాదు,ఓట్లు అత్యధికంగా రావాలి,అందుకోసం ప్రొమోషన్స్ ఒక రేంజ్ లో చెయ్యాలి.ఇదంతా ఎంతో ఖర్చు తో కూడుకున్న వ్యవహారం, ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య నేను అంత ఖర్చు చెయ్యలేను అంటూ చేతులెత్తేశాడు.కానీ రాజమౌళి గురించి మన అందరికీ తెలిసిందే కదా.
పట్టుదల ఉన్న మహామొండి మనిషి..ఏదైనా అనుకున్నాడు అంటే కచ్చితంగా అది జరిగి తీరాల్సిందే.జరిగే వరకు ఆయన నిద్ర కూడా పోడు.ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ వరకు రావడం అనేది ఎంతో అరుదైన గౌరవం.కేవలం తెలుగు సినిమాకి మాత్రమే కాదు,ఇండియన్ సినిమాకే ఎంతో గర్వకారణం అని చెప్పొచ్చు.అలాంటిది అంత దూరం వచ్చిన తర్వాత ఆస్కార్ అవార్డు గెలుచుకోకపోతే బాగుండదు అనే ఉద్దేశ్యం రాజమౌళి లో ఉంది.అందుకే ఆయన నిర్మాత డబ్బులు ఖర్చు చెయ్యకపోయినా, తన సొంత డబ్బులతో ప్రొమోషన్స్ కోసం ముందుకు వచ్చాడు.ఒక ప్రముఖ నిర్మాత 80 కోట్లు ఖర్చు అయ్యింది అంటూ రీసెంట్ గా సంచలన వ్యాఖ్యలు చేసాడు.

అంత ఖర్చు అయ్యి ఉండదు కానీ, కోట్లలోనే ఖర్చు మాత్రం అయ్యిందని తెలుస్తుంది.ఈ ప్రొమోషన్స్ మొత్తం వృధా అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చేసింది అంటూ ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఒక లిస్ట్ విడుదల చేసింది.మరి ఆ లిస్ట్ లో చెప్పినట్టుగానే మనకి ఆస్కార్ అవార్డు వచ్చిందా లేదా అనేది తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.