
Naresh – Pavitra Lokesh Marriage: నటుడు నరేష్ జనాలకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. నటి పవిత్ర లోకేష్ తో ఆయన సహజీవన ఎపిసోడ్ అనేక మలుపులు తీసుకుంటుంది. సస్పెన్సు థ్రిల్లర్ ని మించిన సినిమాలా ఫుల్ కిక్ ఇస్తుంది. గత ఏడాది నరేష్-పవిత్రల ఎఫైర్ మేటర్ వెలుగులోకి వచ్చింది. ఈ సీనియర్ యాక్టర్స్ జంటగా మహారాష్ట్రలో గల మహాబలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నరేష్, పవిత్ర లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ఆ కథనాలపై నరేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. పవిత్ర నేను కలిసి జీవిస్తున్న మాట నిజమే. అయితే వివాహం చేసుకోలేదు. వివాహ వ్యవస్థ మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. పెళ్ళైన ప్రతి పది జంటల్లో ఎనిమిది జంటలు విడిపోతున్నాయి. కలిసి జీవించడానికి పెళ్లి లైసెన్స్ మాత్రమే. ప్రస్తుతానికి పవిత్రను వివాహం చేసుకునే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం అన్నారు.
ఈ ఎపిసోడ్ అనంతరం రమ్య రఘుపతి రంగంలోకి దిగింది. ఆమె ఎంట్రీతో నరేష్-పవిత్రలు అలర్ట్ అయ్యారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. 2022 డిసెంబర్ 31న నరేష్ పెళ్లి ప్రకటన చేశారు. త్వరలో పవిత్ర లోకేష్ తో పెళ్లి అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ ప్రకటన రమ్య రఘుపతిని ఆగ్రహానికి గురి చేసింది. నరేష్ పరువు తీసేలా ఆమె దారుణ ఆరోపణలతో మీడియా ముందు రచ్చ చేశారు.

ఇటీవల నరేష్-పవిత్రల పెళ్లి వీడియో విడుదల చేయడం సంచలనమైంది. పవిత్ర లోకేష్ మెడలో నరేష్ తాళి కట్టి ఏడడుగులు వేశారు. విడాకులు తీసుకోకుండానే నరేష్ పెళ్లి చేసుకున్నారని అందరూ భావించారు. అదే సమయంలో ఇది సినిమా సన్నివేశం కూడా కావచ్చే సందేహాలు కలిగాయి. నరేష్ మాత్రం వివరణ ఇవ్వలేదు. ఎట్టకేలకు నరేష్ పెళ్లి వీడియో ప్రమోషనల్ స్టంట్ అని తేలిపోయింది. నరేష్-పవిత్ర ప్రధాన పాత్రల్లో ‘మళ్ళీ పెళ్లి’ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఎమ్మెస్ రాజు దర్శకుడిగా ఉన్న ఈ చిత్రాన్ని… నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.