
Tulsi Tree: మన ఇంట్లో వాస్తు ప్రకారం అన్ని ఉంచుకునేలా చూసుకోవాలి. ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల విషయంలో కూడా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తులసి మొక్క ఉంటే అన్ని శుభాలు అని భావిస్తున్నారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క కావడంతో దీన్ని అందరు తమ ఇళ్లలో పెంచుకోవడం సహజమే. భోపాల్ గ్యాస్ లీకేజీ ఘటనలో అక్కడ తులసి మొక్కలు ఉన్న వారి ఇళ్లలో ఉన్న వారికి పెద్దగా నష్టాలు కలగలేదని చెబుతారు. అంటే తులసిలో మన ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలు కూడా దాగి ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. దీంతోనే తులసిని ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు అందరు ఇష్టపడుతున్నారు.
పురాణాల్లో..
పురాణాల్లో కూడా తులసికి ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడికి తులాభారం వేసినప్పుడు ఎన్ని వేసినా బరువు తూగలేదు. కానీ తులసి కాడను వేసిన వెంటనే సమానంగా వస్తాడు. ఇలా తులసికి ఉన్న విలువ తెలిస్తే మనకు ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. అందుకే తులసిలో దైవభక్తి, అద్భుత శక్తులు ఉన్నట్లు చెబుతుంటారు. మన సంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉండటం గమనార్హం. తులసిని ఎలా మొక్కాలి? ఏ పద్ధతులు పాటించాలి అనే వాటిపై మనం జాగ్రత్తలు తీసుకోవడం సహజం.
ప్రత్యేక పూజలు
తులసికి ప్రత్యేకంగా మహిళలు పూజలు చేస్తుంటారు. తులసిని పూజించే క్రమంలో మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. తులసి మొక్కను తూర్పు లేదా ఉత్తరంలో నాటుకోవాలి. కుదరకపోతే ఈశాన్యం దిక్కులో పెట్టుకుంటే ఫలితం వస్తుంది. దిక్కులు దివ్యమైనవిగా భావిస్తాం. తులసిని ఎప్పుడు నేల మీద నాటకూడదు. దానికి ఓ కోట కట్టి ప్రత్యేకంగా చూసుకుంటే మంచిది. దీంతో మనకు శుభాలు కలిగిస్తుంది. వాస్తు శాస్త్రంలో తులసికి ఎన్నో మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతుంటారు.
ఎక్కడ ఉంచాలి
తులసి మొక్కను ఎక్కడ ఉంచాలి. ఎత్తైన ప్రదేశంలో నాటడంతో మనకు ప్రయోజనాలు దక్కుతాయి. తులసి మొక్కను చీకట్లో ఉంచకూడదు. దుమ్ము ధూళి ఉన్న చోట నాటితే మనకు ఇబ్బందులు వస్తాయి. దీన్ని ఎత్త్తైన ప్రదేశంలో నాటాలి. తులసి కోటను కుండీలో ఉంచాలి. ఎత్తులో ఉంటేనే కుటుంబంలో అందరి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తులసికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితమైన ప్రాంతంలోనే తులసిని నాటుకుని మన ఇంటికి రక్షణగా ఉంచుకోవాలి.

ఎలా చూసుకోవాలి
తులసి మొక్కను ఎలా చూసుకోవాలి. ప్రతి రోజు ఉదయం పూట తులసి కోటకు పూజ చేస్తారు. మరికొందరు ప్రదక్షిణలు చేస్తారు. ఇంకొందరు దీపం వెలిగిస్తారు. తులసి కోటకు పూజలు చేయడంలో విభిన్న పద్ధతులు ఉంటాయి. వాటిని పాటిస్తేనే మనకు అభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి తులసి ఎంతో మేలు చేస్తుంది. మన కుటుంబంలో శాంతి, ఆరోగ్యం కలగాలంటే తులసి కోటకు పూజలు చేస్తేనే మంచి జరుగుతుందని చెబుతుంటారు. అందుకే తులసిని దైవంగా భావించుకోవాలి.