Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: బ్లడ్ బ్రీడ్ వారసత్వం కదా... లోకేష్ నుంచి అలాంటి మాటలే వస్తాయి

Nara Lokesh: బ్లడ్ బ్రీడ్ వారసత్వం కదా… లోకేష్ నుంచి అలాంటి మాటలే వస్తాయి

Nara Lokesh: ఏ రాజకీయ నాయకుడైనా తన సౌధాలు విడిచి.. మంది మార్బలాన్ని విడిచి జనంలో తిరుగుతుంటే.. అదీ పాదయాత్ర ద్వారా జనాన్ని కలుసుకుంటుంటే కొంత జ్ఞానం సమకూరుతుంది. సమాజం పట్ల అవగాహన తీరుతుంది. ఔట్ లుక్ విస్తృతం అవుతుంది. ఇన్నాళ్ళూ ఒకే తరహా జీవనంలో బతికిన కళ్ళకు కొత్త లోకం కనిపిస్తుంది.. ఏ రాజకీయ నాయకుడైనా సరే… ఎంతటి ఉత్తర మారుడైనా సరే.. మరెంతటి లక్ష్మణ కుమారుడైనా సరే.. కానీ లోకేష్ ఈరోజు కూ అలాగే ఉన్నాడు.. అవే మాటలు మాట్లాడుతున్నాడు..అవును మరి ఆ బ్లడ్ బ్రీడ్ అదే కదా..

Nara Lokesh
Nara Lokesh

1994లో హైదరాబాద్ ఎవరికీ తెలియదట. అంతా రాళ్లు రప్పలట. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రాంతం ఘనమైన ఆత్మ గౌరవ ప్రతీకను కించపరుస్తున్నామని సోయ కూడా లేదు ఈ నాయకుడికి. పైగా కాబోయే ముఖ్యమంత్రి అంట కూడా… ఆంధ్ర ప్రదేశ్ లో టాప్ టెన్ నాయకులందరినీ తీసుకుంటే అధికారంలో ఉన్న వాళ్లతో సహా అందరూ ఇదే టైప్ కనిపిస్తున్నారు.. హైదరాబాదులోనే బతుకుతాడు.. ఈ నీళ్లే తాగుతాడు. ఇక్కడి తిండే తింటాడు. కానీ మాట్లాడితే హైదరాబాదును కించపరచాలి.. ఆయన తాత హైదరాబాద్ వచ్చాకే ఇక్కడి జనం అన్నం తినడం మొదలు పెట్టారని ఒకడు కూస్తాడు. తాత ఈ ప్రాంత వాసులకు తెల్లవారి లేవడం నేర్పించాడని ఇంకెవరో అరుస్తారు. జొన్న అన్నం తప్ప వేరే దిక్కులేని ప్రాంతం నుంచి వచ్చి, బాస్మతి బియ్యంతో బిర్యాని తినీ తినీ మొహం మొత్తిన హైదరాబాదీయులకు సంస్కృతి నేర్పిస్తారు ఈ జ్ఞానవంతులు.

వాళ్ల నాయన ఏమో నేనే హైదరాబాద్ కట్టాను అంటాడు మాటిమాటికి. బాబ్బాబు, పత్తర్ ఘట్టి, శాలీ బండ, డబ్బీర్ పూర, జుమ్మెరాత్ బజార్ ఎక్కడ ఉన్నాయో మ్యాప్ లో చూపించు అని ఎవరైనా అడిగితే బాగుండు.. లోకేశం కొత్త తరం కదా, మరిన్ని తెలివితేటలు పుణికి పుచ్చుకుని అసలు 1994లో హైదరాబాద్ అంటే ఎవరికీ తెలియదని,అన్నీ రాళ్ళూ రప్పలేనని కూశాడు. ఇక్కడ కుశాడు అనే పదం వాడేందుకు పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదు.. అమర్యాదకరమైన ఇతర గొట్టు తిట్టు పదాలు వాడలేక..

అప్పుడప్పుడు హైదరాబాద్ ఎన్నికల్లో తిరుగుతూ ఈయన గారి మామగారు మేరీ ప్యారి బుల్ బుల్ అని ఏదో వాగేస్తాడు. తను ఇక్కడే చదువుకొని, ఇక్కడి తిండితోనే అలా తయారయ్యాడు. 1994లో ఏమీ లేని నగరానికి ఈ లోకేశం తాత, అనగా సీనియర్ ఎన్టీఆర్ 1983లో ఎందుకు వచ్చాడట? తెలంగాణ ప్రాంతాన్ని తెగ ఉద్ధరించేద్దామని వచ్చాడా? 1994 దాకా ఆ రాళ్లు రప్పలు ఏరుకుంటూ కూర్చున్నాడా? మీ అయ్యగారు…అనగా నాన్నగారు, అనగా తండ్రి గారు కుర్చీ ఎక్కింది కూడా 1995లో..

Nara Lokesh
Nara Lokesh

ఆ రాళ్లు రప్పల మధ్య ప్రమాణ స్వీకారం చేశాడా? అప్పటిదాకా అండమాన్ సెంటినలీస్ లాగా బట్టలు లేకుండా ఆ రాళ్లు రప్పల్లో పడి తిరుగుతున్న తెలంగాణ ఆదివాసులు చంద్రబాబును చూసి చప్పట్లు కొట్టారా? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రతి మాటకూ ఒక విలువ ఉండాలి.. లేకుంటే తెలుసుకోవాలి.. లేకపోతే మూసుకోవాలి.. అంతేకానీ ఇప్పటికీ ఈ ప్రాంతం మీద పడి బతుకుతూ ఈ ప్రాంతాన్నే కించపరచడం ఏమిటి? దీన్నే తిన్నచోట మూతి రాయడం అంటారు.. పాపం ఆ లోకేష్ ఇప్పటికైనా తెలుగు నేర్చుకుంటే మంచిది.. తెలుగు మాట్లాడటం నేర్చుకుంటే మరింత మంచిది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular