Nara Lokesh- Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా మారాయి..ఎన్నికల సమయం ముందుకు వచేస్తుండడం తో ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుండే తమ వ్యూహాలతో ముందుకు కదలడానికి సన్నాహాలు ప్రారంభించేసారు..పవన్ కళ్యాణ్ త్వరలోనే బస్సు యాత్ర ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు..ఇందుకోసం ఆయన ప్రత్యేకించి చేయించుకున్న ‘వారాహి’ వాహనం కి తెలంగాణ కొండగట్టు మరియు విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నాడు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని ఈ పర్యటనల ద్వారా ఎక్కడ టీడీపీ మరియు జనసేన పార్టీలు సొంతం చేసుకుంటుందనే భయం తో అధికారిక వైసీపీ పార్టీ జీవో నెంబర్ 1 ని తీసుకొచ్చి రోడ్ షోస్ చెయ్యకూడదని ఉత్తర్వులు జారీ చేసింది..అయితే పవన్ కళ్యాణ్ తన వారాహి ని జీవోతో సంబంధం లేకుండా రోడ్ మీదకి తీసుకొచ్చి రోడ్ షో చేసాడు..ప్రభుత్వ యంత్రాంగం ఏమి చెయ్యలేకపోయింది..అలాగే ‘యువగళం’ పేరిట నారాలోకేష్ చేపట్టిన పాదయాత్ర కూడా నేడు కుప్పం లో ప్రారంభం అయ్యింది.

ఈ సందర్భంగా కుప్పం లో ఏర్పాటు చేసిన ఒక భారీ బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించాడు..ఈ మీటింగ్ లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..’ఏ 1 జాదూగాడు ఒక కొత్త జీవో తీసుకొచ్చాడు..ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చెయ్యకూడదు అట..ప్రజల తరుపున పవన్ కళ్యాణ్ నిలబడకూడదు అట..ఆయన రాజకీయ పర్యటన చెయ్యడం కోసం ఏర్పాటు చేసుకున్న ‘వారాహి’ ని రోడ్డు మీద తిరగనివ్వరట..ఇలా అనుమతులు ఇవ్వకుండా ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు..కానీ ఇలాంటి మతిస్థిమితం లేని వాళ్ళు చేసిన జీవో లు చెల్లవు..నిన్న పవన్ కళ్యాణ్ గారి ‘వారాహి’ ని అడ్డుకోగలిగారా..నేడు నా పాదయాత్ర ని అడ్డుకోగలిగారా..ఆ జీవో తో నువ్వు ఏమి పీకలేవు కానీ దానిని మడిచి ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ పెట్టుకోండి’ అంటూ నారా లోకేష్ చాలా ఘాటుగా స్పందించాడు.