Tarakaratna Heart Attack: రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ తరుపున చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ‘యువగళం’ పేరిట ఒక పాదయాత్రను ఈరోజు ఘనంగా ప్రారంభించాడు… నేడు కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభం అయ్యింది..ఈ యాత్రకి నారా లోకేష్ తో పాటుగా బాలయ్యబాబు, నందమూరి తారకరత్నతోపాటు టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.. అశేషంగా అక్కడికి వేలాదిమంది అభిమానులు తరలిరావడంతో డీ హైడ్రేషన్ కు గురై తారకరత్న సొమ్మసిల్లి కింద పడిపోయాడు.

వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించి శస్త్ర చికిత్స అందించారు..తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు..స్పెషలిస్ట్స్ ని పిలిపించి తారకరత్న ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నాడు.. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలయ్య మీడియాకి వివరణ ఇచ్చారు.
బాలయ్య మాట్లాడుతూ ‘ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.. అభిమానులు ఆందోళన చెందొద్దు.. నాన్నమ్మ , తాతయ్య , అభిమానులు ఆశీసులు ఉండగా తారకరత్నకి ఏమి జరగదు.. తారకరత్న గుండెకి ఎడమ వైపు వాల్వ్ బ్లాక్ అయ్యింది..అందుకే అతను స్పృహ తప్పి కిందపడిపోయాడు..హాస్పిటల్ కి తీసుకెళ్లిన సమయానికి తారకరత్నకి పల్స్ లేదు.. శరీరం మొత్తం నీలం గా మారిపోయింది..అది చూసి మేము కూడా కాస్త ఆందోళనకి గురి అయ్యాం..వెంటనే సీపీయార్ చేసి ఆయనకీ పల్స్ వచ్చేలా డాక్టర్లు చికిత్స చేసారు.. ఇప్పుడు ఆయన బీపీ కూడా నార్మల్ గానే ఉంది..అన్ని ప్యారామీటర్స్ నార్మల్ గానే ఉన్నాయి..అయితే మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకి ఫ్లైట్ ద్వారానో లేదా అంబులెన్సు ద్వారానో పంపించబోతున్నాము’ అని బాలయ్య ఈ సందర్భంగా మాట్లాడాడు.

తారక రత్న శరీరం ఎందుకు నీలం గా మారింది..విష ప్రయోగం జరిగితేనే శరీరం అలా మారిపోతుంది..తారకరత్న మీద ఎవరైనా విష ప్రయోగం చేసారా వంటి సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి..దీనికి నందమూరి కుటుంబం ఏమని సమాధానం చెప్తుందో చూడాలి.