
Nani: సినిమా సినిమాకి న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ పెరిగిపోతుంది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి ఈ రేంజ్ కి వచ్చిన నాని ని చూసి అభిమానులు ఎంతో మురిసిపోతూ ఉంటారు.కెరీర్ ప్రారంభం నుండి రొమాంటిక్ లవ్ స్టోరీస్ ని ఎక్కువగా చేస్తూ వచ్చిన నాని, రీసెంట్ గా ‘దసరా’ సినిమా తో ఊర మాస్ రోల్ ద్వారా మన అందరిని ఈ నెల 30 వ తారీఖున సర్ప్రైజ్ చెయ్యబోతున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఈ నెల 16 వ తేదీన లక్నో లో విడుదల చెయ్యబోతున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఏకంగా 85 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు సమాచారం.ఇదంతా పక్కన పెడితే ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానీ నాని కొత్త సినిమా డిజిటల్ రైట్స్ అప్పుడే అమ్ముడుపోయిందట.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట.సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఇందులో హీరొయిన్ గా నటిస్తుండగా, గౌతమ్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు.ఒక కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమాకి కేవలం నాని పేరు మీద డిజిటల్ రైట్స్ కి ఇంత బిజినెస్ జరిగిందంటే ఆయన రేంజ్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.దీనితో పాటుగా థియేట్రికల్ మరియు సాటిలైట్ రైట్స్ కలిపి వంద కోట్ల రూపాయిల బిజినెస్ ని చేస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

ఈ రేంజ్ డిమాండ్ ఉన్నందున నాని కూడా తన రెమ్యూనరేషన్ ని 22 కోట్ల రూపాయలకు పెంచేసాడట.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.మామూలు డైరెక్టర్స్ తో తీస్తేనే ఇంత డిమాండ్ ఉంటే, ఇక స్టార్ డైరెక్టర్స్ తో కలిసి నాని పనిచేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
