Homeఎంటర్టైన్మెంట్Anasuya Holi Incident: యాంకర్ అనసూయ కి చేదు అనుభవం.. హోలీ వేడుకల్లో పరువు తీసిన...

Anasuya Holi Incident: యాంకర్ అనసూయ కి చేదు అనుభవం.. హోలీ వేడుకల్లో పరువు తీసిన ఆకతాయిలు!

Anasuya Holi Incident: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీలలో ఒకరు యాంకర్ అనసూయ. సమాజం లో జరిగే కొన్ని అంశాలపై ఆమె తన అభిప్రాయాలను ఎలాంటి భయం బెరుకు లేకుండా చెప్తూ ఉంటుంది. ఆ కారణం చేత ఈమె నెటిజెన్స్ చేత తీవ్ర స్థాయిలో ట్రోల్స్ కి గురి అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈమె అభిప్రాయాలూ నెటిజెన్స్ అభిప్రాయాలతో సరితూగవు. రీసెంట్ గానే శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తుల పై చేసిన వ్యాఖ్యలకు ఈమె కౌంటర్లు ఇవ్వడం , అందుకు ఆమె ఒక రేంజ్ లో ఫైర్ అవ్వడం వంటివి జరగడం మనమంతా చూశాం. కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు, తన అభిప్రాయం పై చాలా గట్టిగా నిలబడింది. ఇలాంటి ఉన్న ఆమెని ఇష్టపడేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న అనుసూయ కి చేదు అనుభవం ఒకటి ఎదురైంది.

Also Read: విజయ్–రష్మిక ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. సెట్ చేశారంతే!

పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ హోలీ వేడుకల్లో పాల్గొన్న అనసూయ , మైక్ అందుకోగానే కొంతమంది ఆకతాయిలు ‘ఆంటీ..ఆంటీ’ అంటూ అరవడం మొదలు పెట్టారు. దీంతో అవమానం ఫీల్ అయిన అనసూయ , కోపం చూపించలేక, నవ్వుతూ మాట్లాడుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోయింది. ఈ వీడియో ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతం లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన అనసూయ ని ఒక వ్యక్తి ‘ఆంటీ’ అని సంబోధిస్తే అనసూయ చాలా ఫైర్ అయ్యింది. ‘చెప్పుతో కొడుతాను..దమ్ముంటే అలా పిలిచిన వాళ్ళు స్టేజి మీదకు రండి’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అలాంటి అనసూయ ఇప్పుడు ఇంత కూల్ గా ఈ సందర్భాన్ని హ్యాండిల్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు.

అనసూయ మనసు చాలా సున్నితమైనది. తనపై చిన్న ట్రోల్ వచ్చినా తీసుకోలేదు. గతం సోషల్ మీడియా లో ఈమె పై ట్రోల్స్ చేసే ప్రతీ ఒక్కరి పై చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతూ ఉండేది . సాధారణంగా సినీ సెలబ్రిటీలు కొంతమంది ఇలాంటి ట్రోల్స్ ని పెద్దగా పట్టించుకోరు. కానీ అనసూయ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. తనని ఎంత మంది ట్రోల్ చేస్తే అంత మంది పోలీస్ కేసులు పెట్టడం ఈమెకు అలవాటు. రీసెంట్ గా శివాజీ మ్యాటర్ లో తనపై ట్రోల్స్ వేసిన నెటిజెన్స్ పేర్లను నోట్ చేసుకొని మరీ , పోలీస్ స్టేషన్ కి వెళ్లి సైబర్ కంప్లైంట్ ఇచ్చింది. మరి ఇప్పుడు అంతమంది తనని అవమానించినా పట్టించుకోలేదంటే, పూర్తిగా మారిపోయిందా ? అని అంటున్నారు నెటిజెన్స్.

 

 

https://www.youtube.com/shorts/Qegf4i0vfio?feature=share

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version