Pawan Kalyan’s #OG : పవన్ కళ్యాణ్ #OG లో న్యాచురల్ స్టార్ నాని..? ఇదే జరిగితే ఫ్యాన్స్ కి ఇక పండగే!

Pawan Kalyan’s #OG : టాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటి #OG..టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ గత మూడు రోజుల నుండి ముంబై లో జరుగుతుంది.నేటి నుండి పవన్ కళ్యాణ్ సెట్స్ లో పాల్గొన్నాడు,ఈ నెలాఖరు వరకు సాగనున్న ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మీద కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ […]

Written By: NARESH, Updated On : ఏప్రిల్ 18, 2023 9:03 సా.
Follow us on

Pawan Kalyan’s #OG : టాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటి #OG..టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ గత మూడు రోజుల నుండి ముంబై లో జరుగుతుంది.నేటి నుండి పవన్ కళ్యాణ్ సెట్స్ లో పాల్గొన్నాడు,ఈ నెలాఖరు వరకు సాగనున్న ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మీద కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా నటిస్తుంది.నేడు పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్న సందర్భంగా మూవీ టీం సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలను మరియు వీడియోని అప్లోడ్ చేసింది.సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి.ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అసలు విషయానికి వస్తే #OG చిత్రం లో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఒక కీలక పాత్ర పోషించేందుకు ఒక పేరున్న హీరో అవసరం ఉంది.ఇంతకు ముందు ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ని సంప్రదించినట్టు వార్తలు వినిపించాయి.అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ పాత్ర కోసం మన న్యాచురల్ స్టార్ నాని తో మూవీ టీం సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నాని ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు,సినిమాలో ఎంతో శక్తివంతమైన పాత్ర కాబట్టి ఆయన ఒప్పుకునే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకి రానుంది.నాని రీసెంట్ గానే ‘దసరా’ సినిమా సూపర్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నాడు.ఇదే ఊపులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఒప్పుకొని చేస్తే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అభిమానులు,మరి ఆయన ఒప్పుకుంటాడో లేదో చూడాలి.