Dasara Movie Review: నటీనటులు : నాని , కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్ర ఖని, సాయి కుమార్
డైరెక్టర్ : శ్రీకాంత్ ఓదెల
సంగీతం : సంతోష్ నారాయణ్
బ్యానర్ : స్టార్ స్టూడియోస్ , AA ఫిలిమ్స్
న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చేసే నాని మొట్టమొదటిసారి ఊర మాస్ లుక్ రోల్ తో మన ముందుకు వచ్చాడు. కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాని కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని, కన్నడ సినిమా ఇండస్ట్రీ కి ‘కాంతారా’ , ‘KGF’ సినిమాలు ఎలాగో, మన టాలీవుడ్ నుండి #RRR చిత్రం ఎలాగో, ‘దసరా’ చిత్రం కూడా టాలీవుడ్ నుండి అదే రేంజ్ సినిమా అవుతుందని హీరో నాని అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పడం మనం చూసాము. టీజర్ , ట్రైలర్ మరియు పాటలు ఇవన్నీ బాగా క్లిక్ అవ్వడం తో నాని చెప్పిన మాటలను జనాలు నమ్మారు. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ హీరో రేంజ్ లో జరిగాయి, అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదలైంది. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందొ లేదో చూద్దాము.
కథ :
ధరణి ( నాని) సింగరేణి బొగ్గు కర్మాగారం లో పని చేసే ఒక కూలీ. ఇతనికి సూరి అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, చిన్నప్పటి నుండి వీళ్లిద్దరు అన్నదమ్ములు లాగా కలిసి మెలిసి ఉండేవారు. అలా సాగిపోతున్న వీళ్లిద్దరి జీవితాల్లోకి వెన్నెల (కీర్తి సురేష్ ) వస్తుంది. ఈమెని అటు ధరణి , ఇటు సూరి ఇద్దరు ప్రేమిస్తారు. కానీ వెన్నెల మాత్రం ధరణి ని కాకుండా సూరి ని ప్రేమిస్తుంది. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే విషయాన్నీ తెలుసుకున్న ధరణి, స్నేహితుడి కోసం తన ప్రేమని త్యాగం చెయ్యడానికే సిద్ధం అవుతాడు. కానీ ఇంతలోపే సూరి ని విలన్ చంపేస్తారు,తనతో చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన ఒక వ్యక్తి అలా చనిపోవడాన్ని చూసిన ధరణి తీవ్రమైన మనోవేదానికి గురి అవుతాడు. తన మిత్రుడుని చంపినా వారిపై పగ ఎలా తీర్చుకున్నాడు అనేదే స్టోరీ.
విశ్లేషణ:
స్టోరీ కాస్త రొటీన్ అనిపించినా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరుకి శభాష్ అని మెచ్చుకోక తప్పదు. చాలా సన్నివేశాలకు థియేటర్స్ లో మనకి తెలియకుండానే చప్పట్లు కొట్టేస్తాము,అంత అద్భుతంగా ఆయన సన్నివేశాలను రాసుకున్నాడు. చూస్తూ ఉంటే ఈ సినిమాని తీసింది నిజంగా కొత్త డైరెక్టర్ యేనా అని అనిపించక తప్పదు.అంత చక్కగా అనుభవం ఉన్నవాడిలాగా ఈ సినిమాని తీసాడు. ఇక హీరో నాని నటన గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. మనోడు మామూలు సన్నివేశాలనే తన అద్భుతమైన నటనతో వేరే లెవెల్ కి తీసుకెళ్లగలడు. అలాంటిది అద్భుతమైన సన్నివేశాలు పడితే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.’దసరా’ విషయం లో అదే జరిగింది. నాని లో ఇంత మాస్ ఉందా అని అందరూ ఆశ్చర్యపొయ్యేలా చేస్తుంది ఈ చిత్రం.
ఇక నాని కి స్నేహితుడి పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టి కూడా అద్భుతంగా నటించాడు,ఇది వరకే ఆయన కన్నడలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో మరియు పలు టీవీ సీరియల్స్ లో నటించాడు. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించాడు, ఇదే ఆయనకీ తెలుగులో మొట్టమొదటి సినిమా. నటన తో పాటుగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది, కచ్చితంగా ఇతగాడు భవిష్యత్తులో పెద్ద రేంజ్ కి వెళ్తాడు అని మాత్రం కచ్చితంగా చెప్పగలం, ఆ రేంజ్ లో చేసాడు.నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ కి మహానటి తర్వాత అలాంటి పాత్ర పడలేదు, ఈ సినిమాలో ఆమె ఆ రేంజ్ లో నటించింది. ఇక సోషల్ మీడియా లో దుమ్ములేపేసిన పాటలు ఆన్ స్క్రీన్ మీద కూడా అదిరిపోయాయి, థియేటర్స్ లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఉన్న ఒకే ఒక్క మైనస్ ఏమిటంటే ఓవర్ రూస్టిక్ గా ఉండడమే. ఫ్యామిలీ ఆడియన్స్ కదలడం కాస్త కష్టం కానీ, సినిమాలో వాళ్ళను ఆకట్టుకునే ఎమోషన్ కూడా బలంగానే ఉంది.
చివరి మాట : చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో విడుదలైన ఊర మాస్ సినిమా, మాస్ ఫైట్స్ తో పాటుగా, మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి, కచ్చితంగా ఈ చిత్రం నాని కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచే సినిమా అని చెప్పొచ్చు.
రేటింగ్ : 3 / 5
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Nani dasara movie full review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com