Bigg Boss 9 Telugu Demon Pawan : ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులుగా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అందరిలో టాప్ 5 వరకు నిల్చిన కంటెస్టెంట్స్ డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్ పడాల. వీళ్ళిద్దరిలో టైటిల్ విన్నింగ్ కి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్ డిమోన్ పవన్. చాలా కష్టాలు ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాడు. కానీ ఎప్పుడూ కూడా తనకు ఉన్న కష్టాలు గురించి చెప్పుకొని సానుభూతి పొందాలని చూడలేదు. తన గేమ్ ద్వారానే ఆడుకుంటూ ఇంత దూరం వచ్చాడు. కొందరిలాగా రైతు బిడ్డ ట్యాగ్, ఆర్మీ ట్యాగ్ ని ఉపయోగించుకోలేదు. అంతే కాకుండా కొందరిలాగా బలమైన పీఆర్ టీం ని పెట్టుకొని హౌస్ లోకి అడుగుపెట్టలేదు. బిగ్ బాస్ హిస్టరీ లో పీఆర్ టీం లేకుండా టాప్ 5 కి రావడమే కాదు, టాప్ 3 వరకు నిల్చిన ఏకైక కంటెస్టెంట్ ఒక్క డిమోన్ పవన్ మాత్రమే.
రీతూ చౌదరి తో లవ్ ట్రాక్ కారణంగా ఇతని గేమ్ చాలా వారాల వరకు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యిందో , అప్పటి నుండి డిమోన్ పవన్ తన విశ్వరూపం చూపించేసాడు. టాస్కులు ఎలాగో ఇచ్చి పారేస్తాడు. కానీ ఎంటర్టైన్మెంట్ లో గత రెండు వారాలుగా ఇతను ఇమ్మానుయేల్ ని సైతం డామినేట్ చేసాడు. అందుకే ఆడియన్స్ ఇమ్మానుయేల్ కంటే ఇతనికే ఎక్కువ ఓట్లు వేశారు. మొదటి వారం నుండి డిమోన్ పవన్ ఆట ఇలాగే ఉండుంటే అతన్ని అందుకోవడం ఎవరి తరం అయ్యేది కాదు. కనీవినీ ఎరుగని రేంజ్ ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో ఉండేవాడు. పాపం రివ్యూయర్స్ కూడా డిమోన్ పవన్ ని తొక్కేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కొంతమంది రివ్యూయర్స్ అయితే పవన్ కళ్యాణ్ పడాల అనే వ్యక్తికీ పీఆర్ లాగా మారిపోయి, ఎలాగో డిమోన్ పవన్ గెలవడు, 5 వ స్థానం లో ఎలిమినేట్ అవుతాడు , అతని అభిమానులు ఓటు ని వృధా చేయకుండా పవన్ కళ్యాణ్ ఓట్లు వేయండి అంటూ సిగ్గు విడిచి వీడియోలు చేశారు.
కానీ ఆడియన్స్ రియల్ టాలెంట్ ని గుర్తించారు కాబట్టే డిమోన్ పవన్ ని మూడవ స్థానం లో నిలబెట్టారు. టాప్ 3 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడు రవితేజ , ఆషిక రంగనాథ్ 15 లక్షల రూపాయిల సూట్ కేసు తో లోపలకు వెళ్తారు. డిమోన్ పవన్ ఆ సూట్ కేసు ని స్వీకరించి బయటకు వస్తాడు. అతనికి కేవలం 15 లక్షలు మాత్రమే కాదు, పాతిక లక్షలు ఇచ్చినా తప్పు లేదు. హౌస్ లో గొడ్డు చాకిరి చేయడం, ఫిజికల్ టాస్కులు బీభత్సంగా ఆడడం, తనతో తలపడాలంటే ఎవరికైనా వణుకు పుట్టెంత భయాన్ని కలిగించడం, ఇలా ఒక్కటా రెండా డిమోన్ పవన్ రియల్ హీరో అనిపించుకున్నాడు. అతని భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.