
Dasara Collection Day 4: ఈమధ్య కాలం లో మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ లో ఆడేస్తున్నాయి.స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాదు, మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా దుమ్ము లేపేస్తున్నాయి. కార్తికేయ 2 అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు, అందుకే అప్పటి నుండి మన మేకర్స్ పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చెయ్యడం ప్రారంభించారు. కొన్ని సక్సెస్ అయ్యాయి,కొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
రీసెంట్ గా విడుదలైన దసరా చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదలైంది. తెలుగు లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో మాత్రం డిజాస్టర్ గా నిల్చింది. ఈ నాలుగు భాషలకు కలిపి వచ్చిన వసూళ్లు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.మేకర్స్ కి ఇది నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి నాలుగు రోజుల్లో కనీసం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదని తెలుస్తుంది. మూవీ టీం మొత్తం ఇతర బాషలలో ప్రత్యేకమైన ప్రొమోషన్స్ చేసారు.నాని అయితే రీసెంట్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కాంతారా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని బలమైన నమ్మకం తో ఉండేవాడు.ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ ప్రమోషన్ ఈవెంట్ లోను నాని ఈ విషయం చెప్పుకొచ్చాడు. ట్రైలర్ మరియు టీజర్ కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్ అందరిని ఆకర్షించే విధంగానే కట్ చేయించాడు.కానీ ఫలితం మాత్రం సూన్యం.

ఇది నిజంగా నాని ని తీవ్రమైన నిరాశకి గురి చేసిన విషయం. కానీ ఈ ప్రయత్నం ఇక్కడితో ఆగిపోకూడదు, ఆయన తన రాబొయ్యే సినిమాలను కూడా ఇలాగే డబ్ చేసి విడుదల చెయ్యాలి, అప్పుడు ఇతర రాష్ట్రాల ఆడియన్స్ కి చిన్నగా అలవాటు పడుతాడు, ఇక ఆ తర్వాత ఈయన సినిమాలకు అక్కడ మినిమం రేంజ్ ఓపెనింగ్స్ అయినా వస్తాయని అంటున్నారు విశ్లేషకులు.