
MMTS II Phase : హైదరాబాద్ వాసులకు మెట్రో వరం అయింది. సుదూర ప్రాంతాలను నిమిషాల్లో చేరుకునే వెసులుబాటు కలిగింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోయాయి. గతంలో బస్సుల్లో కిక్కిరిసిపోయే జనం ఇప్పుడు మెట్రోలో తమ గమ్యాలను సులువుగా చేరుతున్నారు. నగరంలోని ఏ మూల నుంచి అయినా కనీస ధరల్లో చేరుతున్నారు. బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఎక్కువ చార్జీలు అయ్యేవి. ప్రస్తుతం మెట్రో అందుబాటులోకి రావడంతో ప్రయాణంలో ప్రయాసలు లేకుండా పోయాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సాధారణంగా వెళ్లే పరిస్థితి వచ్చింది.
మెట్రో ప్రయాణం ఇంతకుముందు నగరానికి పరిమితమైంది. శివారు ప్రాంతాలకు సౌకర్యం ఉండేది కాదు. దీంతో రైల్వే అధికారులు 2014లోనే శివారు ప్రాంతాలకు సైతం మెట్రో సదుపాయం ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మేడ్చల్ వరకు మెట్రో విస్తరించారు. ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. గతంలో మేడ్చల్ వెళ్లాలంటే చుక్కలు కనిపించేవి. మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజల కష్టాలు తీరనున్నాయి.

ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మేడ్చల్ వరకు పొడగించడంతో పనులు పూర్తి చేశారు. మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్ మధ్య మెట్రో పరుగులు పెట్టనుంది. దీంతో కేవలం రూ. 10 నుంచి 15లతోనే గమ్యం చేరే అవకాశం కలగనుంది. ఇంత తక్కువ ధరలోనే 40 నుంచి 55 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వెసులుబాటు కలగనుంది. మేడ్చల్ నుంచి లింగంపల్లికి 52 కిలోమీటర్లు ఉండటంతో ప్రయాణానికి రెండు నుంచి మూడు గంటలు పట్టేది. ప్రస్తుతం గంటలోనే గమ్యస్థానం చేరుకోవచ్చు.
మేడ్చల్ – తెల్లాపూర్ తో పాటు మేడ్చల్ – ఉందానగర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా ఎంఎంటీఎస్ రైలు సేవలు కొనసాగనున్నాయి. నగరంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా తక్కువ ఖర్చులో ప్రయాణించే వీలు కలగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే సహకారంతో ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తున్నారు. దీంతో ప్రజలకు ఎంత దూరాన్ని అయినా సులభంగా చేరుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు తమ గమ్యాలను చేరుకోనున్నారు.