Nandigama : భర్త వేషాలను తట్టుకోలేక మర్మంగాన్ని కోసేసింది

శుక్రవారం రాత్రి  ఆనంద్ బాబు మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ లోని వీడియోలు చూస్తూ తనను తాను మరిచిపోయాడు. దీనిని గమనించిన రెండో భార్య వరమ్మ వాగ్వాదానికి దిగింది. దంపతులిద్దరు మధ్య కొట్లాట జరిగింది. తీవ్ర ఆగ్రహంతో విచక్షణకోల్పోయిన వరమ్మ బ్లేడుతో భర్తపై దాడిచేసి, మర్మంగాన్ని కోయడంతో తీవ్రగాయమైంది.

Written By: Dharma, Updated On : July 22, 2023 5:01 pm
Follow us on

Nandigama : ఆడది దేనినైనా తట్టుకుంటుంది కానీ సవతి పోరును తట్టుకోదు. ఈ విషయం చాలా సందర్భాల్లో చూసుంటాం. చాలాసార్లు వినుంటాం కూడా. మొదటి భార్యతో విభేదాలు తలెత్తడంతో ఓ వ్యక్తి విడాకులిచ్చాడు. ఎంచక్కా మరో భార్యను పెళ్లి చేసుకున్నాడు. కానీ మొదటి భార్యతో ఉన్న అనుబంధాన్ని మరచిపోలేకపోయాడు. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆమె వీడియోలను చూస్తూ మురిసిపోయాడు. కానీ అనుకోకుండా రెండో భార్యకు దొరికిపోయాడు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య బ్లేడుతో తెగబడింది. మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న బాధితుడ్ని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామలో వెలుగుచూసింది ఈ షాకింగ్ ఘటన.

కృష్ణా జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. దంపతులిద్దరి మధ్య తరచూ వివాదాలు జరుగుతుండడంతో విడాకులు తీసుకున్నారు. ఐదేళ్ల కిందట వరమ్మ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులు ఐదు నెలల కిందటే నందిగామకు చేరుకున్నారు. స్థానికంగా పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అయితే శుక్రవారం రాత్రి  ఆనంద్ బాబు తన మానాన తాను సెల్ చూసుకుంటున్నాడు. మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ లోని వీడియోలు చూస్తూ తనను తాను మరిచిపోయాడు. దీనిని గమనించిన రెండో భార్య వరమ్మ వాగ్వాదానికి దిగింది. అంతటి ప్రేమ ఉన్నవాడివి తనను ఎందుకు పెళ్లి చేసుకున్నావని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది.

దంపతులిద్దరు మధ్య కొట్లాట జరిగింది. తీవ్ర ఆగ్రహంతో విచక్షణకోల్పోయిన వరమ్మ బ్లేడుతో భర్తపై దాడిచేసింది. మర్మంగాన్ని కోయడంతో తీవ్రగాయమైంది. రక్తస్రావంతో ఆనంద్ బాబు కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తొలుత నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.