Mahesh Babu Remuneration: అక్షరాలా 78 కోట్లు..మహేష్ ముందు దరిదాపుల్లో లేని పాన్ ఇండియన్ స్టార్స్!

మహేష్ బాబు ఇతర హీరోల లాగా ఇంకా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టలేదు. అయ్యినప్పటికీ కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చెయ్యడం ఆశ్చర్యార్ధకం. అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ వంటి హీరోలు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పాన్ ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేసి భారీ బడ్జెట్ తో చేస్తున్నవి. వాళ్లకి 70 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు. కానీ మహేష్ బాబు 'గుంటూరు కారం' చిత్రం లాంటి ప్రాంతీయ బాషా చిత్రానికి 78 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది, ఆయన క్రేజ్ ఎలాంటిదో నిరూపిస్తుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Written By: Vicky, Updated On : July 22, 2023 5:19 pm

Mahesh Babu Remuneration

Follow us on

Mahesh Babu Remuneration: యావరేజి సినిమాలకు కూడా ఊహించని వసూళ్లు రప్పించే స్టార్ హీరోలు తెలుగు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఒక్కరు సూపర్ స్టార్ మహేష్ బాబు. అంచలంచలుగా ఎదుగుతూ హిట్ మీద హిట్ కొడుతూ ‘పోకిరి’ అనే చిత్రం సూపర్ స్టార్ గా మారిపోయాడు.అప్పటి నుండి మహేష్ బాబు అనేది ఒక పేరు కాదు, టాలీవుడ్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ గా మారిపోయింది.

అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న హీరో కి నిర్మాతలు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికైనా సిద్ధం అయిపోతారు. అందుకే మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ చిత్రానికి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మహెష్ బాబు అక్షరాలా 78 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

మహేష్ బాబు ఇతర హీరోల లాగా ఇంకా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టలేదు. అయ్యినప్పటికీ కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చెయ్యడం ఆశ్చర్యార్ధకం. అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ వంటి హీరోలు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పాన్ ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేసి భారీ బడ్జెట్ తో చేస్తున్నవి. వాళ్లకి 70 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు. కానీ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం లాంటి ప్రాంతీయ బాషా చిత్రానికి 78 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది, ఆయన క్రేజ్ ఎలాంటిదో నిరూపిస్తుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా తక్కువ శాతమే అయ్యింది. అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 160 కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం. మరి మహేష్ పేరు మీద అంత బిజినెస్ జరుగుతున్నప్పుడు, ఆయన 78 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చెయ్యడం లో తప్పు లేదు కదా అని అంటున్నారు ట్రేడ్ పండితులు.