https://oktelugu.com/

Naga Shaurya : అందరు హీరోల్లాగానే పబ్లిక్ గా నాగ శౌర్య ఆ పనిచేశాడా? వైరల్ వీడియో

Naga Shaurya : ఈ మధ్య చిన్న హీరోలందరూ ఓ గొప్ప టెక్నిక్ కనుక్కున్నారు. తమ చిత్రాల విడుదలకు ముందు ఏదో ఒక రచ్చ చేసి వార్తల్లో నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ విషయంలో ఈ స్టంట్ బాగా వెలుగులోకి వచ్చింది. ఆయన నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం చిత్రం కోసం ఓ ఫ్రాంక్ ప్లే చేశాడు. థియేటర్స్ వద్ద రివ్యూస్ చెప్పే లక్ష్మణ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి… సూసైడ్ డ్రామా క్రియేట్ చేశారు. రోడ్డు పక్కన […]

Written By:
  • NARESH
  • , Updated On : February 28, 2023 / 08:07 PM IST
    Follow us on

    Naga Shaurya : ఈ మధ్య చిన్న హీరోలందరూ ఓ గొప్ప టెక్నిక్ కనుక్కున్నారు. తమ చిత్రాల విడుదలకు ముందు ఏదో ఒక రచ్చ చేసి వార్తల్లో నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ విషయంలో ఈ స్టంట్ బాగా వెలుగులోకి వచ్చింది. ఆయన నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం చిత్రం కోసం ఓ ఫ్రాంక్ ప్లే చేశాడు. థియేటర్స్ వద్ద రివ్యూస్ చెప్పే లక్ష్మణ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి… సూసైడ్ డ్రామా క్రియేట్ చేశారు. రోడ్డు పక్కన అతడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. ఇది విమర్శల పాలైంది. పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తూ ఈ సిల్లీ పనులేంటని జనాలు సోషల్ మీడియాలో తిట్టిపోశారు.

    తర్వాత హీరో నందు బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రష్మీతో గొడవపడ్డట్లు ఒక ఫ్రాంక్ చేశాడు. బిగ్ బాస్ ఫేమ్ సన్నీ… ఏటీఎం వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఓ ఎటిఎం చోరీ చేసి పారిపోతున్నట్లు భ్రమ పెట్టాడు. తాజాగా హీరో నాగ శౌర్య కూడా ఇదే చర్యకు పాల్పడ్డాడనే సందేహం కలుగుతుంది. నాగ శౌర్య ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కారణం… పబ్లిక్ లో తన లవర్ ని కొట్టిన అబ్బాయిని నాగ శౌర్య నిలదీశాడు. ఆ అమ్మాయికి సారీ చెప్పంటూ ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చాడు.

    ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే కొందరు ఇది నిజం కాదంటున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మార్చి 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కోసం ఆయన చేసిన ఫ్రాంక్ కావచ్చని అంచనా వేస్తున్నారు. హీరోలు ప్రచారం కోసం ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు.. ఒక ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. మాళవిక నాయర్ హీరోయిన్. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

    ఇక నాగ శౌర్య వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా లక్ష్య కోసం చాలా కష్టపడ్డారు. గత ఏడాది ఆయన వివాహం చేసుకున్నారు. బెంగుళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని నాగ శౌర్య పెళ్లి చేసుకున్నారు. బెంగుళూరులో అత్యంత సన్నిహితుల మధ్య ఆయన వివాహం ముగిసింది. తాజాగా నాగశౌర్య తన లవర్ ను చెంపదొబ్బ కొట్టిన ప్రియుడికి వార్నింగ్ ఇచ్చింది ఫ్రాంక్ నా? లేక నిజంగానా? అన్నది తెలియాల్సి ఉంది.

    https://twitter.com/UnqBoi007/status/1630375426639134727?t=nOR53QQ5kzzqAzxgCr_Jrw&s=08