కరోనా.. లాక్డౌన్ కారణంగా చిత్రపరిశ్రమ కుదేలైపోయింది. గత తొమ్మిది నెలలుగా థియేటర్లు మూతపడగా.. షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో ఈరంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలమంది కార్మికులు వీధిన పడ్డారు. ఈ సమయంలోనూ సినిమా ఇండస్ట్రీని.. నిర్మాతలను ఓటీటీలే అందుకున్నాయి.
Also Read: ముందుగా రొమాన్స్ మొదలెట్టిన పుష్ప !
కరోనాతో థియేటర్లు మూతపడటంతో సినిమాలు రిలీజుకు నోచుకోలేక నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినిమాలకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో గత్యంతరంలేక సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయమే నిర్మాతలను ఆ తర్వాత వారిని నష్టపోకుండా కాపాడింది.
ఓటీటీలో చాలా సినిమాలన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఒకవేళ ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లలో రిలీజైతే నిర్మాతలు భారీగా నష్టపోయేవారు. నిర్మాతలు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడం వల్లే నిర్మాతలు నష్టాల నుంచి సేఫ్ అయ్యారనే టాక్ ఉంది. అయితే ఓటీటీలో సినిమా హిట్టయినా.. ఫ్లాప్ అనేది మాత్రం నిర్ణయించేది ఎవరనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
థియేటర్లు నడిచినపుడు సినిమా హిట్.. ప్లాప్ అనేది ఆడియెన్స్ టాక్.. కలెక్షన్ల రూపేణ తెలిసేది. ఫస్ట్ డే కలెక్షన్లతో సినిమా రేంజ్ తెలిసిపోయేది. అయితే ఓటీటీలో రిలీజయ్యే సినిమా విషయంలో హిట్.. ప్లాప్ అనేది మాత్రం ఎవరూ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలకు మాత్రం కలెక్షన్లను ప్రమాణీకంగా కాకుండా వ్యూయర్ షిష్ ను తీసుకుంటారని తెలుస్తోంది.
Also Read: మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన బిగ్ బాస్ !
అయితే ప్రముఖ ఓటీటీలు మాత్రం సినిమాను ఎంతమంది ప్రేక్షకులు చూశారనేది మాత్రం వెల్లడించడం లేదు. దీంతో సినిమా హిట్టా.. ఫట్టా అనేది మాత్రం తెలియడం లేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజై సినిమాలన్నీ కూడా నిర్మాతలకు ఎంతోకొంత ప్రాఫిట్ ఇస్తున్నాయి. దీంతో ఓటీటీ రిలీజయ్యే సినిమాలన్నీ కూడా హిట్ కిందే లెక్క అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు చిన్న సినిమాలకే పరిమితమైన ఓటీటీలు ప్రస్తుతం మిడిల్.. పెద్ద సినిమాలకు కూడా వేదికగా మారడం గమనార్హం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్