
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ మే 12 వ తేదీన విడుదల అవ్వబోతున్న సందర్భంగా హీరో నాగ చైతన్య ఇప్పటి నుండే ప్రొమోషన్స్ ప్రారంభించేసాడు. ఆయన నటించిన చివరి చిత్రం ‘థాంక్యూ’ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడడం తో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని చేసాడు. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
రీసెంట్ గానే ఆయన తమిళ స్టార్ హీరో శింబు తో ‘మానాడు’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీసి మంచి జోష్ లో ఉన్నాడు.ఇప్పుడు ఈ చిత్రం తో వరుసగా రెండవసారి సూపర్ హిట్ ని అందుకోబోతున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమిళ సీనియర్ హీరో అరవింద్ గో స్వామి విలన్ గా నటించాడు.
అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య నిన్న పోలీస్ ఆఫీసర్స్ తో చిట్ చాట్ చేసాడు. ఈ చిత్రం లో ఆయన ‘కానిస్టేబుల్’ గా నటించిన సంగతి తెలిసిందే.పోలీస్ జీవితం ఎలా ఉంటుంది,డ్యూటీ లో లేనప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, మఫ్టీ లో ఎలా డ్యూటీ చేస్తారు ఇలా ఎన్నో విషయాలను వాళ్ళను అడిగి తెలుసుకొని ఒక గంటసేపు పైగా నాగ చైతన్య తో ముచ్చటించారు పోలీసులు. అంతే కాదు పోలీస్ ట్రైనింగ్ లో చేసే ప్రాక్టీస్ కూడా నాగ చైతన్య కాసేపు సరదాగా గ్రౌండ్ లో చేసాడు.

ఆయన ఇంటరాక్షన్ సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారింది.నాగ చైతన్య వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడిన మాటలకు పోలీసులు ఎంతో ముగ్దులై ఆయనని మెచ్చుకొని సెల్యూట్ చేసారు. పోలీస్ కి డ్యూటీ లో ఉన్నప్పుడు ప్రతీ క్షణం ఎంతో ముఖ్యమైనది. అలాంటిది నాగ చైతన్య కోసం గంటసేపు సమయం కేటాయించి ఆయనతో ముచ్చట్లు పెట్టుకున్నారు అంటే నాగ చైతన్య రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.