China – Taiwan – America : చైనా దృష్టిలో తను వేరు, ప్రపంచం వేరు. దాని ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. అసలు దాని తీరే పరమరోత. దాని వ్యవహారం దృతరాష్ట్ర కౌగిలి సామెత తీరు. దాని విషపు స్నేహంలో మునిగిన దేశాలు ఎన్నో. ఓ పాకిస్థాన్, శ్రీలంక, మయన్మార్, టిబెట్.. ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు జాబితా. అక్కడి దాకా అంతటి అమెరికా మీద బెలూన్లు ఎగరేసింది. మన దేశం అంటే మంట కాబట్టి పాకిస్థాన్‌ను రెచ్చగొడుతూ ఉంటుంది. మన మీద కయ్యానికి కాలు దువ్వమని చెబుతూ ఉంటుంది. మొన్నటి దాకా ఇందుకోసమే నిధులు కూడా ఇచ్చింది. తీరా పాక్ మొత్తం సంకనాకి పోయిన తర్వాత ఇప్పుడు సైలెంట్‌గా ఉంది. మొన్నటికి మొన్న అమెరికా చట్ట సభల ప్రతినిధి నాన్సీ పావెల్ టిబెట్‌లో పర్యటిస్తే ఎంత గాయి గాయి చేసిందో చూశాం కదా! అంతే కాదు జిన్‌పింగ్‌ను జీవితకాలం అధ్యక్షుడిని చేసేందుకు అక్కడి కమ్యూనిస్టు పార్టీలోని వ్యతిరేక వర్గాన్ని ఏకంగా జైలులో పడేసింది. అటుంటి దుర్మార్గపు చైనా ప్రపంచానికి సుద్ధులు చెబుతూ ఉంటుంది. పైగా కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు భారత్ అన్యాయం చేస్తోందని గగ్గోలు పెడుతుంది. అంతర్జాతీయ మోస్ట్‌వాంటెడ్ తీవ్రవాది మసూద్‌పై రెడ్‌కార్నర్ జారీ చేయాలని ఇండియా ఐక్యరాజ్యసమితిలో ఇండియా డిమాండ్ చేస్తే మోకాలడ్డుతుంది. అలాంటి దిక్కుమాలిన చైనా ఇప్పుడు తైవాన్‌పై యుద్ధానికి దిగుతోంది. ఇదేం తప్పులాగా ఇక్కడి కమ్మీలకు కన్పించడం లేదు. అదే మోదీ మీద మాత్రం ఈ సోకాల్డ్ సెక్యూలరిస్టులు విరుచుకుపడతారు.
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి
ద్వీప దేశం తైవాన్‌పై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వందల ఏళ్లుగా చైనా-తైవాన్‌ల వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ముందెన్నడూ లేనట్లుగా చైనా ఇప్పుడు లైవ్‌ఫైర్ ట్రైనింగ్‌కు సిద్ధమవ్వడానికి కారణం యుద్ధకాంక్షే అనే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే చైనా తమ విన్యాసాలను యుద్ధానికి రిహార్సల్స్‌గా అభివర్ణించింది. అంతే కాదు శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు తైవాన్ చేస్తున్న ప్రయత్నాలను తోసిపుచ్చింది. సరిగ్గా.. తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్‌వెన్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో.. దుందుడుకు చర్యలకు చైనా దిగడం విశేషం. తైవాన్ అధ్యక్షురాలు గురువారం అమెరికాకు వెళ్లారు. చైనా దీన్ని నిరసిస్తూ.. శుక్రవారం నుంచి ఆ దేశం చుట్టూ ఎనిమిది యుద్ధ నౌకలు, 42 ఫైటర్‌జెట్‌లను మోహరించింది. కొన్నేళ్లుగా చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉంది. సోమవారం తైవాన్‌కు 80 కిలోమీటర్ల దూరంలో లైవ్‌ఫైర్ శిక్షణ విన్యాసాలు కూడా చేసింది. జాయింట్ సోర్డ్, లైవ్‌పైర్ ట్రైనింగ్ నిర్వహించడం ముందెన్నడూ జరగలేదని, ఈ సారి చైనా తీసుకున్న నిర్ణయం ఆందోళనకరమని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికాకు చెక్ పెట్టేందుకేనా?
వాస్తవానికి తైవాన్ పలు రంగాల్లో అగ్రస్థానాన్ని అందుకుని, ఆయా రంగాల్లో చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే దిశగా కదులుతోంది. 600 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. అంతే కాదు సెమీకండక్టర్ల ఉత్పత్తి, హైటెక్ పరిశ్రమల్లో అగ్రగామిగా ఎదిగింది. అగ్రరాజ్యం అమెరికాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. అమెరికా కూడా ఆర్థిక శక్తి, వ్యూహాత్మక ప్రదేశం, సైద్ధాంతిక కారణాలు అనే మూడు అంశాలపై తనకు వచ్చే ప్రయోజనాల ఆధారంగా చిన్న దేశాలకు భద్రతపై హామీ ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితల్లో ఒకవేళ తైవాన్ గనక చైనాకు స్వాధీనం అయితే పరిస్థితులు మారతాయి. అమెరికా గుత్తాధిపత్యాకిఇ చెక్ పడుతుంది. తూర్పున 150 నాటికన్ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలపై డ్రాగన్‌కు తిరుగలేని పట్టు పెరుగుతుంది. అప్పుడు పొరుగున్న ఉన్న జపాన్‌తోపాటు.. అమెరికాలోని గువామ్ ద్వీపంపై దాడి చేయడం డ్రాగన్‌కు ఈజీ అవుతుంది. ఈ కారణాల దృష్ట్యానే తైవాన్‌కు అమెరికా మద్దతు ప్రకటిస్తోంది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగినప్పుడు అమెరికా ప్రేక్షక పాత్రనే పోషించింది. ఆయుధాలను సరఫరా చేసి చేతులు దులుపుకుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇది మినహా ఉక్రెయిన్‌కు పెద్దగా మద్దతివ్వలేదు.
చైనా దుర్బుద్ధి
చైనా ముందు నుంచి తైవాన్‌పై కన్ను ఉంది. దానిని తమ దేశం నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గానే పరిగణిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైతం పలు సందర్భాల్లో చైనాలో తైవాన్ విలీనం చేసుకుంటామని పునరుద్ఘాటించారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 100వ వార్షికోత్సవం జరగనున్న 2049 నాటికి ప్రపంచంలోనే చైనాను అతిపెద్ద శక్తిగా నిలిపడమే మా లక్ష్యమని అప్పట్లో ప్రకటిం చారు. ఇప్పటి వరకూ టిబెట్, హాంకాంగ్‌ను విలీనం చేసుకున్న చైనాకు.. తైవాన్ ఇప్పటికీ కొరకురాని కొయ్యగా మిగిలిపోయింది. ఆ ఒక్కటీ కలిస్తే.. గ్రేటర్ చైనాగా దేశాన్ని విస్తరించవచ్చనేది జిన్‌పింగ్ వ్యూహంగా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చైనా తీరుపై ఇప్పటికే టిబెట్, షిన్జియాంగ్ ప్రాంతాల్లో వేర్పాటు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. వీటి వెనుక అమెరికా ఉందని చైనా అనుమానం. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ప్రేక్షక పాత్రకే పరిమితం అయితే చైనా దూకుడుకు కళ్లెం పడదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం తీవ్రంగా నష్టపోతోంది. చైనా, టిబెట్ యుద్ధం కనుక మొదలయితే అది ఇతర ఉత్పాతాలకు దారి తీస్తుందనే భయాలు ఇతర దేశాలను కలవరపెడుతున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: China attack on taiwan to hit america
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com