https://oktelugu.com/

Nabha Natesh – Priyadarshi : మిస్టర్.. కామెంట్ చేసే ముందు జాగ్రత్త.. ప్రియదర్శికి ఇచ్చి పడేసిన నభా నటేష్

అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఈ చాట్ సంభాషణ ట్విట్టర్ ఎక్స్ లో చర్చకు దారి తీసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగిందని చెబుతుంటే.. మరికొందరేమో సినిమా ప్రమోషన్ లో భాగమే కావచ్చని సందేహం వ్యక్తం చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2024 / 09:48 PM IST

    Nabha Natesh is the heroine who gave a warning to Priyadarshi

    Follow us on

    Nabha Natesh – Priyadarshi : నన్ను.. దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కన్నడ కస్తూరి నభా నటేష్.. ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. ఆ చిత్రం విజయవంతం కావడంతో సోలో బతుకే సో బెటరూ, మాస్ట్రో, అదిగో, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అల్లుడు అదుర్స్ తర్వాత ఆమె ఇక తెలుగు తెరమీద కనిపించలేదు. వెండితెరకు దూరంగా ఉంటున్న ఆమె గత ఏడాది సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ విడుదల చేశారు. “కొద్దిరోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాను. 2022లో నాకు రోడ్డు ప్రమాదం జరిగింది. దానివల్ల నా ఎడమ భుజానికి తీవ్రంగా గాయమైంది. అనేక శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా భరించలేని బాధను అనుభవించాను. ప్రస్తుతానికయితే కోరుకున్నాను. త్వరలో మిమ్మల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ” నభా నటేష్ పేర్కొన్నది.

    ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి వస్తున్న నభా.. సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ చర్చకు దారి తీసింది. ఆమెకు, టాలీవుడ్ నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. “హాయ్ డార్లింగ్స్ ఎలా ఉన్నారు” అంటూ నభా ట్విట్టర్ ఎక్స్ లో ఒక సరదా వీడియో పోస్ట్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ గొంతుతో ఆమె ఆ వీడియోను రూపొందించారు. ఆ వీడియోకు నెటిజన్ల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. దీనిపై టాలీవుడ్ నటుడు ప్రియదర్శిని స్పందించారు..”వావ్ సూపర్ డార్లింగ్.. కిర్రాక్ ఉన్నావు” అంటూ బదులిచ్చాడు. అయితే ప్రియదర్శి తనను డార్లింగ్ అని పిలవడం పట్ల నభా నొచ్చుకుంది. “భారతీయ శిక్షాస్మృతి చట్టం ప్రకారం సెక్షన్ 354 -a కింద పరిచయం లేని ఒక మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగికంగా వేధించినట్లు సమానం” అని రాసి ఉన్న ఒక చిత్రాన్ని ఆమె షేర్ చేశారు..”మిస్టర్.. కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త” అంటూ ప్రియదర్శిని హెచ్చరించారు.

    “మనం పరిచయం లేని వ్యక్తులనే విషయం నాకు తెలియదు. మీరు మాత్రం డార్లింగ్ అని పిలవచ్చు. మేము అంటే మాత్రం సెక్షన్స్ అని చెబుతారా? లైట్ తీసుకో డార్లింగ్” అని ప్రియదర్శి బదులిచ్చాడు. “ఆహా! అవునా! అద్దటి ప్రవర్తించకు చూసుకుందాం” అని నభా రిప్లై ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఈ చాట్ సంభాషణ ట్విట్టర్ ఎక్స్ లో చర్చకు దారి తీసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగిందని చెబుతుంటే.. మరికొందరేమో సినిమా ప్రమోషన్ లో భాగమే కావచ్చని సందేహం వ్యక్తం చేశారు.