Chiranjeevi : తెలుగు సినిమాల హవా ఇప్పుడు దేశాలు దాటి విస్తరిస్తుంది. నిజానికి ఒకప్పుడు లిమిటెడ్ బడ్జెట్ తో దర్శకులు ఒక కమర్షియల్ సినిమాని చేసి ప్రేక్షకుల ముందు ఉంచేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఒక సినిమా చేయడానికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. డైరెక్టర్ ఆకాశమే హద్దుగా తన ఇమేజినేషన్ పవర్ ని ఉపయోగించి ఎలాంటి కథ రాసుకున్న కూడా ఆ బడ్జెట్ పెట్టడానికి టాలీవుడ్ వెనకడుగు వేయడం లేదు. ఆ సినిమాని తెరపైన విజువల్ వండర్ గా తెరకెక్కించడానికి డైరెక్టర్స్ ,ప్రొడ్యూసర్స్, హీరోలు అందరూ రెడీగా ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు టాలీవుడ్ పైనే పడింది.
ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి నాలుగు దశాబ్దాల నుంచి మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక ఈయన ప్రతిభ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చిరంజీవి దగ్గరికి ఈరోజు రష్యా నుంచి “కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ మాస్కో” ప్రతినిధులు వచ్చి మర్యాదపూర్వకంగా, గౌరవంగా చిరంజీవిని కలిశారు. ఇక వాళ్ళు చిరంజీవి ని కలవడానికి గల కారణం ఏంటి అంటే తెలుగు సినిమాలు ప్రస్తుతం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ హవా ను కొనసాగిస్తున్నాయి. కాబట్టి మన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ఏవి ఉన్నా కూడా రష్యా లో పెట్టుకోమని ఆ ప్రతినిధులు చిరంజీవికి మర్యాదపూర్వకంగా విన్నవించుకున్నారు.
ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ రష్యాలో కూడా జరుగుతున్నాయని అక్కడ ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలియజేశారు. ఇక టాలీవుడ్ కి రష్యాలో షూటింగ్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను రష్యా గవర్నమెంట్ సమకూరుస్తుంది. కానీ మీ సినిమా షూటింగ్ లను మాత్రం మా దేశంలో పెట్టుకోండి. టాలీవుడ్ కి రష్యా కి మధ్య మంచి అనుబంధం ఉండేలా చూడండి అని చిరంజీవి గారితో వాళ్ళు మాట్లాడటం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి..
ఇక మాస్కో గవర్నమెంట్ సినిమా అడ్వైజర్ జూలియా గౌల్బేవ, మాస్కో క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ హెడ్ ఏకటెర్నియా చెక్కర్, ఇక యూనివర్సిటీ డైరెక్టర్ మరియా లాంటి ప్రముఖ ప్రతినిధులు వచ్చి చిరంజీవితో మాట్లాడడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచిందనే చెప్పాలి. ఇక దానికి చిరంజీవి కూడా సానుకూలంగా స్పందిస్తూ మా షూటింగ్స్ కి సంబంధించిన పనులను రష్యాలో పెట్టుకునే విధంగా మేము ప్లాన్ చేసుకుంటామని వాళ్లకి సమాధానం చెప్పాడు. ఇక మొత్తానికైతే టాలీవుడ్ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో కూడా తన హవా ను భారీ రేంజ్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది…