Homeట్రెండింగ్ న్యూస్Naa Anveshana Youtuber: యూట్యూబ్ మానేస్తా అన్నాడు.. ఇప్పుడేమో కంబోడియాలో పెళ్లి చేసుకున్నాడు

Naa Anveshana Youtuber: యూట్యూబ్ మానేస్తా అన్నాడు.. ఇప్పుడేమో కంబోడియాలో పెళ్లి చేసుకున్నాడు

Naa Anveshana Youtuber: దేశసంచారి కి స్థిరత్వం ఉండదు అంటారు. ఈ సామెత ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుందేమో.. ఇటీవల అంటే సరిగా 20 రోజుల క్రితం నేను యూట్యూబ్ మానేస్తున్నానని అన్వేష్ చెప్పాడు. ఇలా దేశదిమ్మరిలాగా తిరగటం వల్ల నాదంటూ సంతోషం లేకుండా పోతోందని.. నాకంటూ ఒక ఆనందం లేకుండా పోతుందని.. నాకంటూ ఒక వ్యక్తిగత జీవితం లేకుండా పోతుందని బాధపడ్డాడు. దాదాపు కన్నీరు కార్చాడు. అంతేకాదు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా చెప్పాడు. ఇక ఆ వీడియో చూసిన చాలామంది అన్వేష్ యూట్యూబ్ ఆపేస్తాడు. సైలెంట్ గా ఉండిపోతాడు అని అనుకున్నారు. కానీ హఠాత్తుగా అది కూడా 20 రోజుల తర్వాత తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు. దానికి కంబోడియా అమ్మాయితో పెళ్లి అని ఒక థంబ్ నైల్ పెట్టాడు. దీంతో చాలామంది అన్వేష్ పెళ్లి చేసుకున్నాడు. మొన్నటి వైరాగ్య వీడియోలో చెప్పినట్టే చేశాడు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు తిరకాసు మొదలైంది.

తనను మంచి ఆటగాడిగా చెప్పుకునే అన్వేష్.. ఇప్పటివరకు తాను అప్లోడ్ చేసిన వీడియోల్లో.. విదేశీ యువతులతో చనువుగా ఉన్న దృశ్యాలు కనిపించేవి. మసాజ్ నుంచి మొదలు పెడితే ఇంకా చాలా కార్యక్రమాలు చేశానని అతడు గర్వంగా చెప్పుకునేవాడు. విదేశీ మైదానాల మీద ఒక భారతీయుడిగా మంచి మంచి ఆటలు ఆడానని ద్వంద్వార్థంతో కూడిన మాటలు మాట్లాడేవాడు. ఇలాంటి మాటలు యూత్ ను బాగా ఆకట్టుకునేవి. అలాంటి మాటలే అతడిని యూట్యూబ్ స్టార్ ను చేశాయి కూడా. అయితే ఏ బంధంలోనూ అన్వేష్ అంత నిలకడగా లేడు. కొన్నిసార్లు మేలిసా, ఇంకొన్నిసార్లు వేరే యువతి, మరికొన్నిసార్లు ఇంకో యువతి.. ఇలా కొత్త కొత్త బంధాలను బయటపెట్టేవాడు. అయితే తాజాగా అతడు కంబోడియా సీరిస్ చేస్తున్నాడు. ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా కూడా అన్వేష్ పులిహోర కలపడం ఆపడు కాబట్టి.. కంబోడియా ప్రాంతంలోనూ హాస్టల్ లో పరిచయమైన యువతి తో చనువు పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆ అమ్మాయితో వీడియోలు తీస్తున్నాడు. కంబోడియా అంటే హిందూ దేవాలయాలు అధికంగా ఉండే ప్రాంతం కాబట్టి.. ఆ అమ్మాయితో కలిసి ఆ ప్రాంతాలకు తిరుగుతున్నాడు. కొబ్బరికాయలు కొట్టడం, అగరుబత్తీలు వెలిగించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు.

20 రోజులు యూట్యూబ్ కు దూరంగా ఉండటం వల్లో, మరే కారణమో తెలియదు కానీ.. అన్వేష్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. కంబోడియాలో పరిచయమైన హిందూ యువతి తో తెగ చక్కర్లు కొడుతున్నాడు. గతంలో తాను కల్పిన పులిహోర ముచ్చట్లు చెబుతూనే.. కొత్త యువతిని పెళ్లి చేసుకోవాలి అనిపిస్తోందని మనసులో మాట చెబుతున్నాడు. ఏ బంధంలోనూ తాను ఇమడలేకపోయానని.. ఈ కొత్త యువతితోనైనా తనకు పెళ్లి జరిగేలా చూడాలని భగవంతున్ని కోరుకుంటున్నాడు. సాధారణంగా ఇలాంటి వీడియోలు చూసిన వారికి అదంతా కూడా సీరియస్ గా సాగే మేటర్ అని అర్థమవుతుంది. అన్వేష్ అలా అనుకునేలా చేస్తాడు కూడా. కానీ అసలు విషయం ఏంటంటే ఈ అమ్మాయి తో కూడా అన్వేష్ పులిహోర కలుపుతున్నాడు. కాకపోతే బతక నేర్చిన యూట్యూబర్ కాబట్టి.. అతడికి కూడా వ్యూస్ కావాలి కాబట్టి.. అలాంటి థంబ్ నైల్స్ పెట్టాడు. మునుమందు జీవితంలో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాడో తెలియదు కానీ.. ఇప్పటికైతే అన్వేష్ పులిహోర కలపడంలో చాలా బిజీగా ఉన్నాడు. కంబోడియా సిరీస్ అయిపోయిన తర్వాత ఇంకే అమ్మాయితో కనిపిస్తాడో.. అక్కడ ఎలాంటి ముచ్చట్లు చెబుతాడో.. అన్నట్టు అప్లోడ్ చేయడమే ఆలస్యం ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.

 

Cambodia capital Phnom penh city tour

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version