Naa Anveshana Vs Sunny Yadav
Naa Anveshana Vs Sunny Yadav: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలామంది ఇన్ ఫ్లూయన్సర్స్ అవతారం ఎత్తుతున్నారు. తమకున్న ఫాలోవర్స్ ను చూసుకుని మిడిసి పడుతున్నారు. దీంతో తాము ఏదో దైవంశ సంభూతులమని భావిస్తున్నారు. ఇదే సమయంలో రెచ్చిపోయే మాటలు.. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో గొడవలు జరుగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో యూ ట్యూబ్ ఇన్ ఫ్లూయన్సర్స్ బయ్యా సన్నీ యాదవ్, అన్వేష్ మధ్య గొడవ మొదలైంది.. సన్నీ యాదవ్ మోటో వ్లాగర్ బైక్ మీద ఇండియా నుంచి అమెరికా వెళ్ళినట్టు చెప్పుకున్నాడు. దీనిని అన్వేష్ ఖండించాడు.. అంతేకాదు అదంతా ఉత్తి డబ్బా అని కొట్టి పారేశాడు.
అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడు మాత్రమే కాదు, గత నాలుగు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. సన్నీ యాదవ్ ది తెలంగాణ ప్రాంతం. నా అన్వేషణ అన్వేష్ ది ఆంధ్ర ప్రాంతం. ఇప్పటికే అతడు 160 పైగా దేశాలను తిరిగి వచ్చాడు. సన్నీ యాదవ్ తన బైక్ మీద ప్రయాణం చేస్తూ. వివిధ దేశాలను చుట్టి వచ్చాడు.. వీరిద్దరికి కూడా సోషల్ మీడియాలో లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల తాను బైక్ మీద అమెరికా చేరుకున్నట్టు సన్నీ యాదవ్ ఒక వీడియో పోస్ట్ చేశాడు. దానిని బూటకం అని అవినాష్ పేర్కొన్నాడు. బైక్ ను లాటిన్ అమెరికా వరకు ఓడలో పంపించి.. అక్కడికి అతడు విమానంలో వెళ్ళాడని.. షిప్ నుంచి బైక్ ను తీసుకొని.. తాను అమెరికా బైక్ మీద వెళ్లినట్టు సన్నీ గొప్పలు చెప్తున్నాడని అన్వేష్ వ్యాఖ్యానించాడు..
Also Read: వాస్తవాలు తెలుసుకో జగన్.. విజయసాయిరెడ్డి కర్తవ్య బోధ!
సోషల్ మీడియాలో పంచాయతీ
బైక్ మీద అమెరికా వెళ్లినప్పటికీ..తన తీరును విమర్శించిన అన్వేష్ పై సన్నీ యాదవ్ విరుచుకుపడ్డాడు. బూతులతో రెచ్చిపోయాడు. ఆ గొడవను వ్యక్తిగతంగా తీసుకెళ్లాడు. దీంతో అన్వేష్ మరో వీడియో బయటపెట్టాడు. సన్నీ యాదవ్ ఓ అమ్మాయిని మోసం చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు సన్నీ నుంచి న్యాయం చేయాలని ఆమె తన వద్దకు వచ్చినట్టు అన్వేష్ పేర్కొన్నాడు.. అంతేకాదు కడప జిల్లా చెందిన పోలీసు అధికారి కుమార్తెకు మాయమాటలు చెప్పి సన్నీ అస్సాం దాకా తీసుకెళ్లాడని ఆరోపించాడు.. ట్రేడింగ్, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ.. అడ్డగోలుగా సంపాదించాడని అన్వేష్ మండిపడ్డాడు.. అయితే సన్నీ యాదవ్ అన్వేష్ చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చాడు. నా వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను ఎందుకు సోషల్ మీడియాలో పెడుతున్నావంటూ అన్వేష్ పై సన్నీ యాదవ్ మండిపడ్డాడు. వీధి కొళాయిల దగ్గర జరుగుతున్న పంచాయితీని తలపిస్తున్న ఈ గొడవకు ఎప్పుడు శుభం కార్డు పడుతుందో చూడాల్సి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.