
Actress Laya Daughter: హీరోయిన్ గా ఒక స్థాయికి వెళ్లిన తెలుగు అమ్మాయిల్లో లయ ఒకరు. విజయవాడలో పుట్టి పెరిగిన లయ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. 1999లో విడుదలైన స్వయంవరం మూవీతో హీరోయిన్ అయ్యారు. హీరో వేణు అదే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. స్వయంవరం హిట్ కావడంతో లయకు ఆఫర్స్ క్యూకట్టాయి. 2005 వరకు ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. అదే సమయంలో ఆమెకు పేరెంట్స్ సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అమెరికాలో డాక్టర్ అయిన గణేష్ గోర్తి అనే వ్యక్తిని లయ 2006లో పెళ్లి చేసుకున్నారు.
చాలా కాలం తర్వాత లయ మీడియా ముందుకు వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.’నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఆంటీ ఒకరు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. మంచి సంబంధం ఉంటే చేసుకుంటానని చెప్పాను. తర్వాత ఇండియా వచ్చేశాను. నాలుగు నెలల తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. అన్ని విధాలా సంబంధం నచ్చడంతో గణేష్ గోర్తి ని వివాహం చేసుకున్నారు. ఆయన వైద్య వృత్తిలో చాలా బిజీగా ఉంటారు. నేను కూడా కొన్నాళ్ళు ఐటీలో పని చేశాను. 2017 తర్వాత వదిలేశాను.
కోట్ల సంపద హోదా కంటే చిన్న చిన్న విషయాలే ఆనందం ఇస్తాయి. డ్రాయింగ్ నాకు ఇష్టమైన వ్యాపకం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. మా ఇద్దరినీ పక్కపక్కన చూస్తే మీ చెల్లెలా అని అడుగుతారు. తను కనీసం ఒక సినిమా చేస్తే చూడాలని ఉంది. అయితే నేను ఎవరినీ అవకాశం ఇవ్వమని అడగను. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అయితే తనని ఇండస్ట్రీకి వెళ్ళమని నేను బలవంత పెట్టను. ఇక అబ్బాయికి 12 ఏళ్ళు. ఇద్దరు పిల్లలు తెలుగు బాగానే మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చాక తెలుగు మర్చిపోయారు..’ అంటూ లయ చెప్పుకొచ్చారు.

కూతురు హీరోయిన్ అయితే చూడాలనే ఆశ లయ బయటపెట్టారు. పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకున్న లయ 2010లో హీరోయిన్ గా చేశారు. నటుడు శివాజీ హీరోగా తెరకెక్కిన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం చిత్రం చేశారు. 2018లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో హీరోయిన్ తల్లిగా చిన్న పాత్రలో మెరిశారు. సినిమా ఆమెకు ఫ్యాషన్ మాత్రమే కానీ డబ్బుల కోసం కాదు. భర్త సంపాదించిన వందల కోట్ల ఆస్తి ఉందని సమాచారం.