
Heroine Rashmika Mandana: హీరోయిన్ రష్మిక మందాన బోల్డ్నెస్ బౌండరీలు దాటేసింది. పబ్లిక్ ఈవెంట్లో కురచ దుస్తులు ధరించి రచ్చ చేసింది. అసలు ఒంటిపై బట్టలు ఉన్నాయా? లేవా? అన్నట్లు రష్మిక తీరుంది. రష్మికను అలా చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. అరాచకానికి పరాకాష్ట అంటూ వాపోతున్నారు. బ్లాక్ స్కర్ట్ ధరించిన రష్మిక మందాన ఒక అవార్డు ఈవెంట్లో రెడ్ కార్పెట్ పై నడిచింది. దీని కోసం ఆమె ఖరీదైన డిజైనర్ వేర్ ధరించారు. ఈవెంట్లో పాల్గొన్న అతిథులు, ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. తన పెర్ఫార్మన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి
జనాలు క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇక రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. పుష్ప 2లో శ్రీవల్లిగా మరోసారి మరిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ క్రేజీ సీక్వెల్ మరింత హంగులతో తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ ఏకంగా రూ. 300 కోట్లకు పెంచేశాడు. అబ్బురపరిచే లొకేషన్స్ లో తెరకెక్కించి, భారీ విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఇటీవల వైజాగ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. పార్ట్ 2 కోసం స్క్రిప్ట్ లో సమూల మార్పులు చేశారని సమాచారం. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి.
అలాగే రష్మిక యానిమల్ టైటిల్ తో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తుండగా… రన్బీర్ కపూర్ హీరో. మాఫియా బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఇండియా వైడ్ యానిమల్ మూవీపై అంచనాలు ఉన్నాయి. యానిమల్ సైతం పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ రెండు చిత్రాల్లో ఒక్కటి హిట్టైనా మరో ఐదారేళ్ళ వరకు రష్మిక కెరీర్ కి ఢోకా ఉండదు.

గత ఏడాది రష్మికకు మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి. బాలీవుడ్ లో నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. వారసుడు మూవీలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకున్నారు. కేవలం విజయ్ హీరో కావడం వలన మూవీ చేశానంటూ స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఎఫైర్ రూమర్స్ తో రష్మిక తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. విజయ్ దేవరకొండతో ఆమె చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. విందులు, విహారాలలో పాల్గొంటున్నారు. అత్యంత సన్నిహితంగా ఉంటూనే… మా మధ్య ప్రేమలేదంటున్నారు.