https://oktelugu.com/

Indian Railways: దేశంలో తప్పక సందర్శించాల్సిన రైలు మార్గాలు ఇవీ

మండపం-పాంబన్-రామేశ్వరం.. భారతదేశంలో ప్రమాదకరమైన మార్గాలలో మండపం రామేశ్వరం వెళ్లే ట్రైన్ వే ఒకటి. ఈ మధ్యలో చాలా సున్నితమైన ఒక వంతెన ఉంటుంది. సాహసాలు చేయాలి అనుకునే వారికి చాలా ఎగ్జైటింగ్ ప్రదేశం ఈ వంతెన.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 23, 2024 / 02:56 PM IST

    Indian Railways

    Follow us on

    Indian Railways: ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం.. బాబోయ్ చదువులు, ఉద్యోగం అంటూ బుర్ర బద్దలు అవుతుందా? మధ్య మధ్యలో కాస్త గ్యాప్ కావాలి అనిపిస్తుందా? కొన్ని ప్రదేశాలను విజిట్ చేస్తే మైండ్ చాలా రిలీఫ్ అవుతుంది. మరి అలాంటప్పుడు రిలీఫ్ కోసం మీరే ఏదైన ప్లేస్ కు వెళ్లొచ్చు కదా.. అలాంటప్పుడు బెస్ట్ ప్లేస్ ఏది అనుకుంటున్నారా? సెర్చ్ చేస్తున్నారా? మరి ఈ ట్రైన్ ప్లేస్ లను విజిట్ చేస్తారా? ట్రైన్ ప్లేస్ లు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి సుందరమైన ఐదు అద్భుతమైన ట్రైన్ వే ఉన్న ప్లేస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    మండపం-పాంబన్-రామేశ్వరం.. భారతదేశంలో ప్రమాదకరమైన మార్గాలలో మండపం రామేశ్వరం వెళ్లే ట్రైన్ వే ఒకటి. ఈ మధ్యలో చాలా సున్నితమైన ఒక వంతెన ఉంటుంది. సాహసాలు చేయాలి అనుకునే వారికి చాలా ఎగ్జైటింగ్ ప్రదేశం ఈ వంతెన. ఈ వంతెన భారతదేశంలోనే రెండవ పొడవైన వంతెన. ఇది తమిళనాడులోని మండపాన్ని రామేశ్వరం వంతెనకు కలుపుతుంది. మరి మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తారా?

    ముంబై నుంచి గోవా.. ఈ ప్రదేశం గురించి జనాలు ఎప్పుడు మాట్లాడుకుంటారు. ఆకర్షణీయంగా ఉండే ఈ ప్రదేశం చూడాలి అనుకుంటే ఇక్కడికి వెళ్లవచ్చు. బిజీ లైఫ్ లో ఉండి కాస్త రిలీఫ్ కావాలి అనుకుంటే ఒకసారి ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందే. ఇంతకీ ఇక్కడ ఏముందంటే.. ఈ దారిలో సహ్యాద్రి కొండలు. అరేబియా సముద్రం కనువిందు చేస్తాయి. 92 సొరంగాలు, 2000 వంతెనల మీదుగా ప్రయాణించే ప్రయాణీకులకు ఈ ప్రదేశం ప్రతి ఐదు సెకన్ లకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

    హిమాలయన్ క్వీన్..`సినిమాలో చూస్తున్న ఫీలింగ్ రావాలంటే కల్కా నుంచి సిమ్లా వరకు వెళ్లాల్సిందే. ఈ మార్గంలో నడిచే రైళ్లు పిల్లలను మేల్కొలిపే టాయ్ రైళ్ల మాదిరి ఉంటాయి. 96 కి. మీ పొడవు ఉంటుంది. 102 సొరంగాలు, 82 వంతెనలు గుండా వెళుతుంది. 96కి. మీ వ్యవధిలో అత్యంత ఎత్తులో ఉండడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకుంది.