Mobile Message: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. మొబైల్ తో కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాకుండా వివిధ అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. ముఖ్యంగా మనీ ట్రాన్షపర్ కు మొబైల్ కీలకంగా మారింది. మొబైల్ నెంబర్ ను బ్యాంకు అకౌంట్ తో లింక్ చేయడం వల్ల బ్యాంకు వ్యవహారాలన్నీ ఇంట్లో ఉండే నిర్వహించుకోవచ్చు. అయితే ఇలాంటి సులభమైన సదుపాయాలున్నా.. మొబైల్ వేరేవారు హ్యాక్ చేస్తే మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల మొబైల్ ద్వారా రూ.21 లక్షలు మాయమయ్యాయి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా?
ఆంధ్రప్రదేశ్ లోని ఓ మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.21 లక్షలు మాయమయ్యాయి. ఆమెకు దఫాలుగా డబ్బులు మాయమవుతున్నట్లు మెసేజ్ వచ్చింది. అయితే తన డబ్బులు ఎలా మాయమవుతున్నాయో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు గుర్తించిన విషయమేంటంటే ఆమె మొబైల్ కు ఏదో ఒక లింగ్ వచ్చింది. అదేంటో చూడాలని ఆమె క్లిక్ చేశారు. అంతే కాసేపటి తరువాత ఇలా డబ్బలుు కట్ అవుతున్నట్లు మెసేజ్ వచ్చింది.
అంటే మొబైల్ కు ఎటువంటి తెలియని మెసేజ్ వచ్చినా లింక్ చేయొద్దని ఈ సందర్భంగా సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. కొందరు హ్యాకర్లు లింకులు పంపిస్తారు. వీటిని ఓపెన్ చేయగానే మొబైల్ వారి చేతులోకి వెళ్తుంది. దీంతో ఆ మొబైల్ తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్లు, వాటి వివరాలు వారికి తెలిసిపోతాయి. ఆ తరువాత వారు మొత్తం సమాచారం సేకరించి డబ్బులు డ్రా చేసుకుంటారు. ఒక్కసారి డబ్బులు ఇతరుల ఖాతాల్లకి వెళ్లిన తరువాత తిరిగి రావడం కష్టం.
అందువల్ల మొబైల్ కు ఎటువంటి మెసేజ్ వచ్చినా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ బ్యాంకు సంబంధించినదైనే నేరుగా బ్యాంకుకు వెళ్లి దాని వివరాలు కనుక్కోవాలి. ఆ తరువాతే లింక్ ఓపెన్ చేయాలా? వద్దా? అని నిర్ణయించుకోవాలి. అలా కాకుండా ముందుగానే లింక్ ను క్లిక్ చేయడం ద్వారా తీవ్రంగా నష్టపోతారు.