Shiv Sena MLA Son: మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే కుమారుడు అధికార మదంతో సెటిట్ మెంట్ల దందా మొదలు పెట్టాడు. పది మందితో కలిసి గోరేగావ్ కార్యాలయం నుంచి ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవోను కిడ్నాప్ చేశాడు. అతడిని దహిసర్‌కు తీసుకెళ్లి, మరో మ్యూజిక్ కంపెనీ యజమాని ఆదేశాల మేరకు కొన్ని ఒప్పంద పత్రాలపై బలవంతంగా సంతకం చేయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది.
ఆర్థిక విభేదాల కారణంగానే..
రాజ్‌కుమార్ సింగ్‌కు మరో మ్యూజిక్ కంపెనీ యజమాని మనోజ్ మిశ్రాతో ఆర్థిక విభేదాలు ఉన్నాయి. బుధవారం సింగ్ తన కార్యాలయంలో ఉండగా, ఎమ్మెల్యే ప్రకాశ్‌సర్వే కార్యాలయానికి రావాలని ఫోన్ చేశారు. సర్వే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శిబిరానికి చెందిన ఎమ్మెల్యే. అయితే సింగ్ తనకు పని ఉందని శనివారం వస్తానని చెప్పాడు. కాసేపటికే పది నుంచి 12 మంది సింగ్ కార్యాలయానికి వెళ్లారు. సింగ్ కాలర్ పట్టుకుని, ఎమ్మెల్యే కార్యాలయానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తన ఉద్యోగుల సమక్షంలోనే సింగ్‌ను పదజాలంతో దుర్భాషలాడారు. అతడిని బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించారు. ఉద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకెళ్లి..
సింగ్‌ను దహిసర్‌లోని ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సర్వే కుమారుడు రాజ్, మిశ్రా ఉన్నారు. ఆర్థిక లావాదేవీలపై చర్చించి కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారు. తర్వాత సింగ్‌ను 500 మీటర్ల దూరంలో ఉన్న భవనంలోని మొదటి అంతస్తులోని అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లారు.
రంగంలోకి పోలీసులు..
సింగ్ మ్యూజిక్ పంపెనీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే సింగ్‌తో బాండ్ పేపర్స్‌పై సంతకాలు తీసుకోవడంతోపాటు ఈ విషయం ఎవరికైనా ఫిర్యాదు చేసినా, చెప్పినా చంపేస్తామని తుపాకీ గురిపెట్టి బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మనీలాండరింగ్, అత్యాచారం కేసులో ఇరికిస్తామని బెదిరించారు. పక్కా సమాచారంతో ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్న పోలీసులు సింగ్‌ను కాపాడారు. బాధుతడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కొడుకు, మరో మ్యూజిక్ కంపెనీ యజమాని మిశ్రా, మరో పది మందిపై కేసు నమోదు చేశారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Mumbai police has registered an fir against the son of a shiv sena mla in the businessmans kidnapping case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com