Homeక్రీడలుMumbai Indians: ఛాంపియన్స్ కు చుక్కలు చూపిస్తున్న ముంబై

Mumbai Indians: ఛాంపియన్స్ కు చుక్కలు చూపిస్తున్న ముంబై

Mumbai Indians
Mumbai Indians

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏ సీజన్ చూసుకున్న రెండు టీములు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతుంటాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండే ఆ రెండు టీమ్ లను ఓడించడం ఐపిఎల్ లోని మిగిలిన జట్లకు కొంత కష్టంగానే ఉంటుంది. ఆ రెండు టీముల్లో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ కాగా, మరొకటి కోల్ కతా నైట్ రైడర్స్. ధోని, షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఇమేజ్ తోపాటు అభిమానులు ఫేవరెట్ గా భావించే టీమ్ ల్లో ఈ రెండు జట్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాయి. అటువంటి బలమైన జట్లకు ఎప్పటికప్పుడు తన బలాన్ని చూపిస్తూ ఓటమి రుచి చూపిస్తోంది ముంబై ఇండియన్స్ జట్టు.

ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అభిమానుల ఫేవరెట్ జట్లలో ఒకటి. తనకంటే కంటే బలమైన జట్లను ఓడించడంలో ముంబై జట్టు ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఐపీఎల్ లో కొరకరాని కొయ్యలుగా భావించే జట్లలో చెన్నై, కేకేఆర్ జట్లు ముందు వరుసలో ఉంటాయి. ఈ జట్లతో మ్యాచ్ అంటే మిగిలిన టీమ్ లు సర్వశక్తులను ఒడ్డుతుంటాయి. కానీ, ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం అలవోకగా వీటిపై విజయాలు సాధిస్తూ ఆ రెండు జట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. బలమైన జట్లపై విజయాన్ని సాధిస్తే వచ్చే కిక్ ను.. ముంబై ఇండియన్స్ ఎంజాయ్ చేసినట్టుగా మరో జట్టు ఎంజాయ్ చేయడం లేదంటే అతిశయోక్తి కాదేమో. విజయాల పరంగా ఈ రెండు జట్లపై పై చేయి సాధిస్తూ.. ముంబై ఇండియన్స్ వారికి నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తుంది. ఈ మాటలు ఫాన్స్ చెప్పుకోవడం లేదు.. ఐపీఎల్ గణాంకాలే స్పష్టంగా చెబుతున్నాయి.

ధోని మాస్టర్ మైండ్ కు విలవిల్లాడే ప్రత్యర్థులు..

ధోని ఏ జట్టులో ఉంటే ఆ జట్టుకు కొండంత బలం. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోని చెన్నై జట్టుకు ఆడుతున్నాడు. అప్రతిహాత విజయాలతో చెన్నై జట్టును విజయ పదంలో నడిపిస్తున్నాడు ధోని. అటువంటి ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై జట్టును ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 సార్లు చిత్తు చేసింది ముంబై జట్టు. ఐపీఎల్ లో చెన్నై జట్టు మిగిలిన మరే జట్టు చేతిలోనూ ఇన్నిసార్లు ఓడిపోలేదు. అసలు చెన్నైపై హెడ్ టూ హెడ్ లో ఈ రేంజ్ లో పై చేయి సాధించిన టీమ్ ముంబై మాత్రమే. తన ఆలోచనలు, ప్రణాళికలతో ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టే ధోని.. ముంబై జట్టుతో మ్యాచ్ అంటే మాత్రం డీలా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధోని ఎత్తులను చిత్తు చేస్తూ ముంబై అద్వితీయమైన విజయాలను నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

Mumbai Indians
Mumbai Indians

కోల్ కతా జట్టుపైనా మెరుగైన రికార్డు..

ఇక కోల్ కతా నైట్ రైడర్స్ కూడా మిగిలిన జట్లకు ఐపీఎల్ లో కొరకరానికి కొయ్యి. బలమైన టీమ్ తో బరిలోకి దిగుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఈ టీమ్. ఇక ఈ టీమ్ యజమాని షారుఖ్ ఖాన్ కావడంతో మరింత మంది అభిమానులు ఈ జట్టుకు ఉన్నారు. భారీ లక్ష్యాలను అలవోకగా చేదించే ఈ జట్టుకు.. ఐపీఎల్ లో మింగుడు పడని జట్టు ఏదైనా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్ మాత్రమే. ఇప్పటి వరకు ముంబై జట్టు కేకేఆర్ 32 సార్లు తలపడగా.. ఏకంగా 23 సార్లు ముంబై జట్టు విజయం సాధించింది. ఏ టీమ్ కూడా మరే జట్టుపై 20 సార్లు గెలవలేదు. ముంబై మాత్రమే రెండు టీములపై 20 కంటే ఎక్కువ సార్లు విక్టరీ కొట్టింది అంటే ఆ జట్టు లెవలేంటో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన జట్లు చిన్నచిన్న టీములపై ఆధిపత్యం చెలా ఇస్తుంటాయి. చాన్సు వచ్చిందంటే చాలు భారీ స్కోర్లు చేస్తుంటాయి. ముంబై మాత్రం కింగ్ లాంటి టీములు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అదే ముంబై ఇండియన్స్ స్పెషాలిటీ అని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జట్టుకు మొదట్లో సచిన్ టెండుల్కర్, ఆ తర్వాత రోహిత్ శర్మ సారధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular