
Shakuntalam Collections: ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించిన చిత్రం ‘శాకుంతలం’.ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించాడు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవలే తెలుగు , హిందీ, తమిళం మరియు మలయాళం బాషలలో గ్రాండ్ గా విడుదలైంది. మొదటిరోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ పరంగా కనీస స్థాయి ఓపెనింగ్ ని కూడా దక్కించుకోలేక పోయింది.
సమంత గత చిత్రం ‘యశోద’ గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు ఈ సినిమా బయ్యర్స్ కి సంతృప్తిని ఇచ్చింది. అలాంటి సినిమా తర్వాత ఇంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ తగలడం సమంత కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమా విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకుంది, ఈ మూడు రోజులకు గాను ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ఈ చిత్రాన్ని నిర్మించడానికి సుమారుగా 50 కోట్ల రూపాయిల ఖర్చు అయ్యిందట.మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక రెండవ రోజు కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగ,మూడవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లు వచ్చాయి. అలా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా,మూడు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది అంటే, ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు.

మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి సుమారుగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాపం గుణ శేఖర్ ఈ చిత్రాన్ని తన దగ్గరున్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి తీసాడు,ఇప్పుడు ఈ చిత్రం ఆయనని జీరో చేసేసింది, కనీసం ఓటీటీ రైట్స్ తో అయినా రికవర్ అవుతాడో లేదో చూడాలి.