
MS Dhoni: గెలిచినప్పుడు చొక్కా విప్పి ఎగర్లేదు..
ఒత్తిడిలో ఉన్నప్పుడు విసుగు చెందలేదు
సొంత రికార్డ్ ల కోసం తాపత్రయ పడలేదు..
ప్రత్యర్థుల పై దురుసుగా ప్రవర్తించలేదు..
అసా ధ్యం ఆనుకున్న విజయాలు సుసాధ్య మైనా ఎగిరి గంతెయ్య లేదు.
హెలికాఫ్టర్ షాట్.. జులపాల జుట్టు..
ఓ దేశాన్ని ప్రపంచ యవనిక పై మొదటి స్థానంలో నిలిపైనా నువ్వు విర్ర వీగ లేదు. నువ్వు బాగా ఆడినప్పుడు సంబరపడ్డాం..
ఆడనప్పుడు ఢీలాపడ్డాం..
కొన్ని సార్లు మెచ్చుకున్నాం.. ఇంకొన్ని సార్లు తిట్టుకున్నాం.
కానీ ఇలా ఊహించని నిర్ణయం తీసుకుంటే కన్నీరు పెట్టుకుంటున్నాం..
జెంటిల్ మెన్ గేమ్ కే జెంటిల్ మెన్ లాంటి ఆటగాడివి నువ్వు..
వ్యక్తి లా వచ్చి శక్తిలా మారావు.. ఓ యోధుడిలా వెళ్లిపోతున్నావ్..
నువ్వు లేకుండా.. ఆడకుండా క్రికెట్ చూసాం.. మా ధోని వస్తాడు.. ఆడతాడు అనే ఆశ తో చూశాం.. కానీ ఇక ఫై నువ్వు కెప్టెన్ వి కావు, క్రికెట్ ఆడవు.. ఆ మాట తలుచుకుంటుంటే గుండె చివుక్కు మంటోంది..
నాయకుడంటే.. నడిచేవాడు.. కాదు నడిపించే వాడు.. ఇది నిన్ను చూశాకే సినిమాల్లో డైలాగ్ గా రాశారేమో..
అంతర్జాతీయ క్రికెట్ కు ఇప్పటికే వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని… ఇప్పుడు ఐపీఎల్ టి20 కి కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు.. ఇందుకు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ధోని గతంలోనే ఐపిఎల్ నుంచి తప్పుకోవాలని చూశాడు. అయితే కోవిడ్ కారణంగా 2020 నుంచి ఐపీఎల్ యూఏఈ, ముంబై లాంటి ప్రదేశాల్లో మాత్రమే జరిగింది.. అయితే ధోని తన వీడ్కోలు మ్యాచ్ చెన్నైలోనే ఆడాలని ఉద్దేశంలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ ధోని కెరియర్లో చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతున్నది.

మే 14న కోల్కతా నైట్ రైడర్స్ తో చెన్నై వేదిక వా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. ఆ రోజే ధోని కి వీడ్కోలు సభ ఏర్పాటు చేసే యోచనలో సీఎస్కే మేనేజ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత మే 20న ఢిల్లీలో చెన్నై తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. అయితే అది ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని ఉంటాడా? లేదంటే వేరే వాళ్ళు ఉంటారో అనేది కూడా తేలాల్సి ఉంది. గత ఏడాది సీజన్ ఆరంభానికి వారం ముందు కెప్టెన్సీ బాధ్యతలనుంచి ధోని తప్పుకున్నాడు. రవీంద్ర జడేజా కు అప్పగించాడు. అయితే సగం మ్యాచులు పూర్తయిన తర్వాత జడేజా తన కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఫలితంగా ధోని మరోసారి సారధిగా బాధ్యతలు తీసుకున్నాడు. మొన్న జరిగిన వేలంలో ఇంగ్లాండ్ టెస్ట్ సారధి బెన్ స్టోక్స్ ను చెన్నై టీం కొనుగోలు చేసింది. దీంతో అతడిని కెప్టెన్ గా చెన్నై టీం ఎంపిక చేస్తుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ఇప్పటి దాకా చెన్నై నిలకడగా ఐపీఎల్ లో రాణించిందంటే దానికి కారణం ధోని..తన కెప్టెన్సీ లో ధోని నాలుగు సార్లు చెన్నై కి ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. కాగా ధోని రిటైర్ మెంట్ ను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.