
Mrunal Thakur: టాలీవుడ్ లో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిల్చిన హీరోయిన్ శ్రీలీల..కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరికి ఈ అమ్మాయే కావాలి..ఇప్పటికే చేతిలో పది సినిమాలను పెట్టుకున్న ఈ అమ్మాయికి ఇప్పట్లో ఎవ్వరు పోటీ రారు అని అందరూ అనుకున్నారు.కానీ ఈమెకి పోటీకి మరో హీరోయిన్ వచ్చే అవకాశం కూడా ఉంది.ఆమె మృణాల్ ఠాకూర్.గత ఏడాది విడుదలైన ‘సీత రామం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.
ఈ సినిమాకి ముందు బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ,ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం రాలేదు, ఆమె మొదటి సక్సెస్ మన టాలీవుడ్ నుండే దక్కింది.ఈ సినిమా తర్వాత ఆమె న్యాచురల్ స్టార్ నాని తో ఒక సినిమా చేయబోతుంది.రీసెంట్ గానే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది.
అయితే రీసెంట్ గా ఆమె బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన ‘సెల్ఫీ’ సినిమా మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.కానీ మృణాల్ ఠాకూర్ ఇమేజి కి ఏమాత్రం డ్యామేజ్ జరగలేదు.ఈ చిత్రం తర్వాత ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయట.రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతుందట, అందులో స్టార్ హీరోలకు సంబంధించిన క్రేజీ ప్రాజెక్ట్స్ యే ఉన్నట్టు తెలుస్తుంది.

అలా శ్రీలీల తర్వాత ఎక్కువ సినిమాలను చేతిలో పెట్టుకున్న ఏకైక హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నిల్చింది.శ్రీలీల వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే, కానీ మృణాల్ ఠాకూర్ వయస్సు 30 కి పైగానే ఉంటుంది.30 దాటినా తర్వాత కూడా ఇంత డిమాండ్ ఉండడం అంటే సాధారణమైన విషయం కాదు.రాబొయ్యే రోజుల్లో పోటీ వీళ్లిద్దరి మధ్యనే ఉండబోతుంది.
