Heat Proof Man: కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. మూఢ నమ్మకాలు ఎన్ని ఉన్నా.. కొన్ని చూస్తే నమ్మశక్యంగా ఉండవు. మన దేశంలోనే ఒక హీట్ ఫ్రూఫ్ మ్యాన్ ఉన్నాడు. ప్రార్థన చేసి వేడి నూనెలో చేయి పెట్టి వాటిని తీసేస్తున్నాడు. అతడి చేతులు కాలడం లేదు. ఈ మాయ ఏంటో తెలియక అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఫుడ్ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో ఫేమస్. ఎక్కడెక్కడి వారో చేస్తున్న ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి సందర్భాలను ఇంటర్నెట్ లో బోలెడు చూస్తుంటాం.. జబల్‌పూర్‌కు చెందిన పకోడీ విక్రయదారుడు దేవా మునుగోడు వాలా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇతడు వేడి నూనెలో పకోడీలను చేతితో తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ పకోడీ విక్రేత గురించి మరింత తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
‘ఇండియా ఈట్ మేనియా’ అనే యూట్యూబ్ చానెల్ లో అప్‌లోడ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి పెద్ద కడాయిలో పకోడీలను (ముంగోడ్) వేయించడాన్ని అందులో చూడవచ్చు. ముందుగా అతను పకోడీ పిండిని తీసుకుని, అందులో పకోడా బాల్స్ ను నూనెలో వేయడం ప్రారంభించాడు. పకోడీలన్నీ వేడి నూనెలో బాగా కాగాక.. చిన్నపాటి ప్రార్థన చేసి, వేడి నూనెలో తన చేతిని ముంచి, పకోడీలను బయటకు తీస్తాడు. అతడి చేతులు కాలవు.. ఏం కావు.. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ అతడి చేయి ఎందుకు వేడి నూనెలో పెట్టినా కాలడం లేదన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రార్థన వల్లే ఇలా కాలడం లేదా? అని అందరూ ఆరాతీస్తున్నారు.
Also Read: బీజేపీతో ఇక తెగదెంపులేనా..? దూరంగా ఉంటున్న పవన్? కారణం నాగబాబేనా?
ఈ వీడియో ప్రకారం, ఇది అతని కుటుంబం ఈ వీధి బజ్జీల వ్యాపారంలో ఉంది. అతని తండ్రి 46 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించాడు. తండ్రి మరణించిన తరువాత దేవా ఈ బజ్జీ సెంటర్ బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతను ఈ పకోడీలను వేస్తూ అమ్ముతున్నాడు. ఒక ప్లేట్ కేవలం రూ. 15కే విక్రయిస్తున్నాడు. అది చేత్లోనే తీసి ఇస్తున్నాడు. తినేవారికి షాకిస్తున్నాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2.7 మిలియన్ల వీక్షణలను పొందింది. 203K లైక్‌లు.. 467 కామెంట్‌లను పొందింది. వైరల్ అయిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా మంది ప్రశంసలు అందుకుంది. కొంతమంది అతని టెక్నిక్‌ను మెచ్చుకుంటే, కొంతమంది అతని చర్యలను చూసి బాధపడ్డారు. పకోడీలు అమ్మే అతని స్టైల్ చూసి ఇప్పుడు అందరూ వావ్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ చేయి కాలకపోవడం వెనుక మతలబేంటని నిలదీస్తున్నారు.
Also Read: భీమ్లానాయక్ దెబ్బకు ఏకంగా సెలవు ప్రకటించిన ఆ దిగ్గజ కంపెనీ
Recommended Video: