Anchor Suma: సుమ.. పుట్టింది కేరళలోనే గాని.. రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుంది. తెలుగును ఓన్ చేసుకుంది. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది.. తెలుగు అమ్మాయి అనే భ్రమ కూడా కలిగిస్తుంది.. అలాంటి సుమ తన వాక్చాతుర్యంతో బుల్లితెరను రెండు దశాబ్దాలకు పైగానే దున్నేస్తోంది. ఇప్పటికీ తన స్పాంటేనీటి తగ్గదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు ఆమె తప్ప వేరే ఆప్షన్ లేదు.. అలాంటి సుమ తెలుగు ప్రేక్షకులకు మొనాటిని కలిగిస్తోంది.. ఆమె ప్రోగ్రామ్స్ చిరాకు తెప్పిస్తున్నాయి.. ఆమె తన రూటు మార్చుకోకపోతే యాంకర్ గా, హోస్ట్ గా ఆ పాపులారిటీ కోల్పోక తప్పదు.. సుమ తన బలహీనత ఏమిటో ఇప్పటికీ గుర్తించడం లేదు.. ఒకే తరహా ఫార్మట్లో, ఒకే తరహా విసుర్లు ఉండడంతో ఆమె ప్రోగ్రామ్స్ ను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదు.. నిదర్శనమే “సుమ అడ్డా” అనే ప్రోగ్రాం.. మస్తు హైప్ క్రియేట్ చేసుకుని, చిరంజీవి పాపులరిటీని, ఇమేజ్ ని కూడా వాడుకున్న ఈ ప్రోగ్రాం టీవీ రేటింగ్స్ లో డమాల్ ఆనేసింది.. గతవారం బార్క్ రేటింగ్స్ లో కేవలం 2.31 టీఆర్పీలు వచ్చినయ్. ఇది అత్యంత దయనీయమైన రేటింగ్. ఓ నాసిరకమైన సినిమాను 20సారి ప్రసారం చేసినా సరే ఇంత దారుణమైన రేటింగ్స్ రావు. ఈ రేటింగ్ చూసి మల్లెమాల బిజినెస్ సర్కిళ్ళు విస్తు పోతున్నాయి.

ఇంతోటి దానికి 31 డిసెంబర్ ఇయర్ ఎండింగ్ లో స్పెషల్ షోలో నేనిక యాంకరింగ్ మానేస్తున్నానంటూ తిక్క ప్రాంక్ వీడియో చేసింది. అది కాస్త ఆభాసుపాలైంది.. దానిని కవర్ చేసుకోలేక నానా తిప్పలు పడింది. అందులోనే కళ్యాణం కమనీయం ప్రమోషన్ షో చేసింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రమోషన్ షో బొంబాట్ చేసేందుకు ప్రయత్నించింది.. ఒక భిన్నమైన షో డిజైన్ చేసుకోలేక రకరకాల టీవీ ప్రోగ్రాములు కలిపేసి,ఓ కిచిడీ షో కు రూపకల్పన చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం.
ఇక స్టార్ మా టీవీ సీరియళ్ళు క్రమేపీ నాసిరకంగా మారుతున్నాయి. రేటింగ్స్ దెబ్బతింటున్నాయి.. కార్తీకదీపం ఆగిపోతే ఆ దెబ్బ మరింత తీవ్రంగా ఉంటుంది.. ప్రస్తుతం అదే జరుగుతున్నది . ఈసారి టాప్ 30 టీవీ ప్రోగ్రామ్స్ లో జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయని ఏకంగా మూడు స్లాట్స్ లో మెరిసింది.. దీనికి బింబిసార ప్రీమియర్ కూడా తోడైంది. దీంతో జీతెలుగు స్టార్ మా టీవీకి మరింత దగ్గర అయింది.. మా టీవీ కనుక మేలుకోకపోతే జీ టీవీ దాని త్వరలో కొట్టేయడం ఖాయం.. ఇక ఈ జాబితాలో ఈటీవీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. జెమినీ గురించి చర్చ వేస్ట్ . ఆ పాత సినిమాల్ని ప్రసారం చేసే జెమిని మూవీస్ రేటింగ్స్… జెమిని టీవీ రేటింగ్స్ ఓకే తీరుగా ఉండటం విశేషం.

పాపం నాగర్జున
ఇక ఓటీటీల దెబ్బ థియేటర్లకే కాదు, టీవీల మీద కూడా భారీగానే పడుతోంది.. బింబిసార రేటింగ్స్ కూడా ఇదే నిరూపిస్తున్నాయి.. థియేటర్లలో ఈ సినిమా సూపర్ హిట్.. కార్తికేయ_2 కంటే దీటుగా వసూళ్ళు సాధించింది. కళ్యాణ్ రామ్ కు కం బ్యాక్ మూవీ.. జస్ట్ 8.6 రేటింగ్స్ వచ్చినయ్.నిజానికి నీ ప్రముఖ సినిమాల రేటింగ్స్ తో పోలిస్తే కాస్త బెటరే.. కానీ టీవీలో ప్రేక్షకులు సినిమాలు చూడటం లేదన్న ట్రెండుకు తగినట్టే ఉన్నాయి రేటింగ్స్.. అందులో కళ్యాణ్ రామ్ ఫెయిల్యూర్ ఏమీ లేదు. చివరకు నాగార్జున సినిమా ది ఘోస్ట్ దారుణంగా షేర్ ఫామ్ చేసింది.. జస్ట్ 2.74 రేటింగ్స్ నమోదు చేసింది.. సుమ అడ్డా స్థాయిలో నిలిచింది. పాపం ఈ సినిమా థియేటర్లలో ఆడలేదు.. ఓటీటీ లు దేక లేదు.. చివరకు బిగ్ బాస్ కూడా పట్టించుకోలేదు. హత విధీ.. నాగార్జున కష్టం పగవాడికి కూడా రాకూడదు.