Monkeypox: కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం తెలిసిందే. దాదాపు రెండేళ్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైరస్ తో జనం పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. ప్రస్తుతం మరో వైరస్ జనాన్ని తిప్పలు పెట్టేందుకు దాపురించింది. మంకీపాక్స్ రూపంలో కోరలు చాస్తోంది. ఇన్నాళ్లు మనుషుల్లో ఉన్న వైరస్ ఇప్పుడు జంతువులకు సోకింది. దీంతో మంకీపాక్స్ వైరస్ పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో తన ప్రభావం చూపిస్తోంది. మంకీపాక్స్ విజృంభనతో అందరిలో భయం ఏర్పడుతోంది.

ఫ్రెంచ్ లో వెలుగు చూసిన మంకీపాక్స్ కేసు ఆందోళన కలిగిస్తోంది. తన పెంపుడు కుక్కకు మంకీపాక్స్ సోకడంతో ఇక జంతువులకు వ్యాపించడంతో ఇంకా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. యజమానితో బెడ్ పై పడుకున్న కుక్కకు ఈ వైరస్ అంటుకున్నట్లు తెలుస్తోంది. మనిషి నుంచి జంతువుకు సోకిన మొదటి కేసుగా దీన్ని గుర్తిస్తున్నారు. స్వలింగ సంపర్కులకే సోకుతున్న మంకీపాక్స్ తొలిసారి కుక్కకు సోకడం భయం కలుగుతోంది. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం పారిస్ కు చెందిన నాన్ మోనోగామస్ గే జంట సెక్స్ చేసినందుకు మంకీపాక్స్ బారిన పడినట్లు తెలుస్తోంది.
తన దగ్గరున్న కుక్కకు వైరస్ సోకినట్లు 12 రోజులకు గుర్తించారు. ఈ వ్యాధి స్వలింగ సంపర్కుల్లోనే కనిపించడంతో ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్ బారిన పడి చాలా మంది బాధపడుతున్నా మరణాల రేటు మాత్రం తక్కువగా ఉండటం ఉపశమనం కలిగిస్తోంది. కానీ ఇప్పుడు జంతువులకు సోకడంతోనే అందరిలో భయం కలుగుతోంది. మంకీపాక్స్ వైరస్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నా అదుపులోకి రావడం లేదు.

మంకీపాక్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. మనుషుల నుంచి జంతువులకు వ్యాపించడంతో ఏం జరుగుతుందోననే బెంగ అందరిలో పట్టుకుంది. మంకీపాక్స్ వైరస్ విజృంభిస్తుండటంతో వైద్యులకు కూడా సవాలుగా మారింది. మంకీపాక్స్ వైరస్ జంతువుల్లో కూడా రావడంతో ఇంకా వేగవంతం అవుతుందని తెలుస్తోంది. ఇన్నాళ్లు స్వలింగ సంపర్కులకు మాత్రమే వచ్చే వైరస్ జంతువుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందో ఏమో అనే అనుమానాలు వస్తున్నాయి. మంకీపాక్స్ వైరస్ ఇక ఏం చేయాలనే దానిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
Also Read:AP Capital Issue: ఏపీని వీడని రాజధానుల రగడ.. కథ క్లైమాక్స్ కు వచ్చినట్టేనా?
[…] Also Read: Monkeypox: యజమాని గే..స్వలింగ సంపర్కం.. బెడ్ ప… […]