ATM: బ్యాంకులు వినియోగదారులను మరోమారు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఏటీఎం వాడే వారి జేబులు గుల్ల చేసేందుకు నిర్ణయించాయి. దీంతో ఆర్థిక లావాదేవీలు జరిపే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులను దోపిడీ చేసేందుకు ఆమోదం తెలపడం ఆందోళనలకు కారణమవుతోంది. ఇక మీదట బ్యాంకు సేవలు వినియోగించుకున్నందుకు రుసుం చెల్లించాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ మేరకు కొత్తగా ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు దీనికి ఆమోదం తెలపడంతో ఇక వినియోగదారులకు భారం వేయడమే తరువాయిగా కానుంది.

ఖాతాదారుల నుంచి సర్ చార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించడంతో ఇకపై మన జేబులు ఖాళీ కావాల్సిందే. ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.17 లు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికేతర లావాదేవీలకు రూ.6లు వసూలు చేయాలని నిర్ణయించడం సంచలనం కలిగిస్తోంది. ఖాతాదారులు చేసే లావాదేవీలకు డబ్బులు చెల్లించాల్సి రావడంతో ఇక మన డబ్బులు బ్యాంకులకు ముట్టజెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు వివిధ రకాల చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉచిత పరిమితికి మించి జరిపే లావాదేవీల్లో ప్రతి లావాదేవీకి రూ.21 లు వసూలు చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇవ్వడంతో ఇక బాదుడే బాదుడుకు చర్యలు సిద్ధమయ్యాయి. అన్ని బ్యాంకులకు నెలవారీ ఉచిత లావాదేవీలు ఉంటాయి. అవి పూర్తయితే చార్జీలు వసూలు చేస్తాయి. దీంతో వినియోగదారులు పరిమిత లావాదేవీలను వినియోగించుకోవచ్చు.

నెలవారీ ఉచిత లావాదేవీలు ఐదు ఉంటాయి. అంతకు మించితే చార్జీ పడుతుంది. ఇతర బ్యాంకుల లావాదేవీలు మూడు వరకు ఉంటాయి. దీంతో వాటిని అధిగమిస్తే చార్జీలు పడతాయి. ఈ క్రమంలో బ్యాంకుల లావాదేవీల్లో వినియోగదారులు ఇక మీదట జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఉచిత లావాదేవీలు మించకుండా చూసుకోవాల్సిందే. డెబిట్ కార్డులకు కూడా చార్జీలు వసూలు చేయనున్నాయి. ఇప్పటికే వసూలు చేస్తున్న చార్జీలతో వినియోగదారులు మేలుకోవాల్సిందేనని చెబుతున్నారు. బిజినెస్ డెబిట్ కార్డులపై రూ.350లు ప్లస్ జీఎస్టీ వసూలు చేసేందుకు నిర్ణయించాయి. డెబిట్ కార్డు రీ ప్లేస్ మెంట్ చార్జీలు రూ.300లు ప్లస్ జీఎస్టీ, డూప్లికేట్ పిన్ రీజనరేషన్ చేసిన రూ.50లు చార్జీ తోపాటు జీఎస్టీ విధించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి.
Also Read:AP Capital Issue: ఏపీని వీడని రాజధానుల రగడ.. కథ క్లైమాక్స్ కు వచ్చినట్టేనా?