Mohan Babu VS Manoj Kumar
Mohan Babu VS Manoj Kumar : గత ఏడాది డిసెంబర్ నెల నుండి మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఆస్తుల విషయంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. క్రమశిక్షణకి మారుపేరు గా పిలవబడే మోహన్ బాబు కుటుంబంలో అసలు ఏమి జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం అవ్వని పరిస్థితి. కొద్దిరోజుల క్రితం మోహన్ బాబు తల్లిదండ్రులు, వృద్దులు, సంరక్షణ, పోషణ చట్టం క్రింద నాకు నా కుమారుడు మంచు మనోజ్ నుండి రక్షణ కల్పించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కి తన సిబ్బంది చేత లేఖ పంపించాడు. ఆ తర్వాత మనోజ్ కలెక్టరేట్ వద్దకు వెళ్లి వివరణ ఇవ్వగా, నేడు మరోసారి వీళ్లిద్దరి వాదనలు వినేందుకు కలెక్టరేట్ కబురు పంపింది. ఈరోజు మధ్యాహ్నం వీళ్ళిద్దరిని సుమారుగా రెండు గంటలపాటు విచారించారు. దాని వివరాలేంటో ఒకసారి చూద్దాము.
కలెక్టరేట్ మోహన్ బాబు అధికారులతో మాట్లాడుతూ బాలాపూర్ మండలంలోని జల్ పల్లి గ్రామంలో తాను నివసిస్తున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా చొరబడ్డాడు అని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడని, నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు కేవలం నాకు మాత్రమే సొంతమని, దాని మీద అన్ని అధికారాలు నాకే ఉన్నాయని, ఎవరికీ ఆ ఆస్తులు ఇవ్వాలి అనేది కూడా నా నిర్ణయమే అంటూ మోహన్ బాబు వివరణ ఇచ్చాడు. ఆ ఆస్తుల్లో ఉండేందుకు మనోజ్ కి ఎలాంటి హక్కు లేదని, తక్షణమే అవి నాకు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేసాడు. ఈ అంశం పై మరింత విచారణ కోసం తదుపరి వారంలో మళ్ళీ మీ ఇద్దరు కలెక్టరేట్ కి హాజరు కావాలని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా మోహన్ బాబు కలెక్టరేట్ వద్ద నడుచుకొని వస్తున్నా విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మనోజ్ కూడా కలెక్టరేట్ లోపల నిల్చొని ఉన్న దృశ్యాలను మనం క్రింది వీడియోలో చూడొచ్చు.
ఈ అంశం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కన్న కొడుకు మీద ఇంత పంతం ఎందుకు?, ఎంత సంపాదించినా, తమ ఆస్తులన్నీ బిడ్డలకే కదా తండ్రి రాసివ్వాలి. ఒక కొడుకు అందలం ఎక్కించి, మరో కొడుకుని తొక్కేయాలని అనుకోవడం అమానుషం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే మనోజ్ ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులను టార్చర్ చేస్తున్నాడని, తాగేసి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఏ తండ్రి కూడా చూస్తూ ఊరుకోడని ఈ సందర్భంగా మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ అంశం ఇంకా ఎన్ని రోజులు సాగదీయబడుతుందో చూడాలి. ఇకపోతే చాలా కాలం తర్వాత మనోజ్ మళ్ళీ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన హీరోగా కాకుండా విలన్ గా చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ‘భైరవం’, ‘మిరాయ్’ చిత్రాల్లో విలన్ గా నటిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Mohan babus parents sent a letter to the rangareddy district collectorate seeking protection from manchu manoj under the maintenance act
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com