Telangana Caste Census : కాంగ్రెస్ చేసిన కులగణన సర్వేపై సొంత పార్టీలోనే నమ్మకం లేకుండా పోతోంది… స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ననే వ్యతిరేకిస్తూ ‘కేసీఆర్ చేసిందే నిజమైన సర్వే’ అంటూ దుమ్మెత్తిపోస్తున్నాడు.
తెలంగాణలో బయటపెట్టిన కులగణన సర్వేలో మొత్తం జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక మతలబు ఉంది. జనరల్ గా బీసీలు అంటే మనం ‘హిందువుల్లోని బీసీలనే’ గుర్తిస్తాం. కానీ హిందువుల్లోని బీసీలు కేవలం 46.33 శాతం మంది మాత్రమే ఉన్నారు. మరి మిగతా బీసీలు ఎవరంటే 10.08 శాతం ఉన్నారు.
కాంగ్రెస్ సర్వేపై బీసీ సంఘ నాయకులు గుర్రుగా ఉన్నారు. తెలంగాణలో బీసీలు 50 శాతం ఉన్నారన్నది వాళ్ల అంచనా.. ఎక్కడ తగ్గిందన్నదే ఇప్పుడు వివాదమైంది. ఈ లెక్కలు ఎంత వరకూ సమగ్రంగా ఉన్నదన్నది అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. హిందూ బీసీలు, ముస్లిం బీసీల డేటా ఇచ్చినా.. క్రిస్టియన్లు, నాన్ రిజర్వుడు కేటగిరీలుగా ఉన్న బీసీల డేటా ఇవ్వలేదు.
తెలంగాణలో ముస్లిం జనాభా 12.5 శాతం ఉన్నారని చెబుతున్నారు. అందులో 10.08 శాతం బీసీలు అని వెల్లడించారు. మొత్తం ముస్లింలలో 80 శాతం మందిని బీసీలుగా పరిగణించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందరూ వెనుకబడిన తరగతులుగా ఉన్నారా? అన్నది ఇక్కడ పాయింట్.
తెలంగాణ కుల సర్వే ఏం చెబుతోంది? ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.