
Manchu Manoj- Mohan Babu: హీరో మంచు మనోజ్ మార్చి 3న వివాహం చేసుకుంటున్నారు. భూమా మౌనికతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఈ వివాహం అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ముగిస్తారని సమాచారం. అందుకే పెళ్లని హింట్ ఇచ్చారు కానీ అధికారిక ప్రకటన చేయలేదు. అక్క మంచు లక్ష్మి పెద్దగా మనోజ్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మనోజ్ పెళ్ళిలో భాగంగా మహా మంత్ర యాగం అనే ఓ క్రతువు నిర్వహించారని సమాచారం. మనోజ్ పెళ్లి వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
కాగా మనోజ్ వివాహానికి మోహన్ బాబు, విష్ణు రావడం లేదని ఇన్సైడ్ టాక్. భూమా మౌనికను చేసుకోవడం ఇష్టం లేని వీరిద్దరూ మనోజ్ వివాహం అవైడ్ చేయనున్నారట. భూమా మౌనిక విషయంలో మొదటి నుండి మోహన్ బాబు అసహనంతో ఉన్నారట. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు. భూమా మౌనిక దివంగత నేత భూమా నాగిరెడ్డి కూతురు. తల్లి శోభా నాగిరెడ్డి కూడా కన్నుమూశారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ టీడీపీలో ఉన్నారు. అక్క అఖిల ప్రియ గత ప్రభుత్వంలో మంత్రిగా చేశారు.
భూమా మౌనిక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడం వ్యతిరేకతకు ఒక కారణమట. అలాగే ఆమెకు కూడా ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విడాకులయ్యాయి. ఈ కారణాలతో మోహన్ బాబు ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారట. మంచు మనోజ్ మాత్రం మనసు మార్చుకునేది లేదని తేల్చి చెప్పేశారట. మనోజ్-మోహన్ బాబు మధ్య గొడవలు ఆస్తుల పంపకాల వరకూ వెళ్లిందట. అందుకే మనోజ్ హైదరాబాద్ లో ఉండటం లేదని టాక్. అన్నయ్య మంచు విష్ణు కూడా ఈ పెళ్లి విషయంలో ఆగ్రహంగా ఉన్నారట.

తాజా సమాచారం ప్రకారం మనోజ్ వివాహానికి మోహన్ బాబు హాజరు కావడం లేదట. అలాగే మంచు విష్ణు కూడా పెళ్ళికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. అక్క మంచు లక్ష్మి మాత్రం తమ్ముడికి అండగా నిలిచారట. కుటుంబం మొత్తం దూరం పెట్టినా లక్ష్మి దగ్గరుండి మనోజ్ వివాహం చేయిస్తున్నారట. కాగా 2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి 2019లో విడాకులు అయ్యాయి. అప్పటి నుండి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. వరుస పరాజయాల నేపథ్యంలో సిల్వర్ స్క్రీన్ కి కూడా దూరమయ్యాడు. ఇటీవల ‘వాట్ ది ఫిష్’ టైటిల్ తో ఒక మూవీ ప్రకటించారు.