Mohan babu vs Manoj : తండ్రి మోహన్ బాబుతో మనోజ్ అమీ తుమీకి సిద్దమయ్యాడు. వీరి మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబుపై మనోజ్ చేయి చేసుకున్నాడని సమాచారం. దాంతో మోహన్ బాబు మనుషులు మనోజ్ మీద దాడి చేశారట. డిసెంబర్ 9న మోహన్ బాబు నిర్మించిన జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. మోహన్ బాబు ఒక నలబై మంది బౌన్సర్లను దింపారు. మనోజ్ కూడా కొందరు బౌన్సర్లను తనకు రక్షణగా తెచ్చుకున్నారు. మనోజ్ తో గన్ మెన్ కూడా ఉన్నాడని సమాచారం.
నిన్న సాయంత్రానికి మనోజ్, మోహన్ బాబు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. మోహన్ బాబు మనుషులైన ఒక పది మంది మీద మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడని సమాచారం. తనకు, తన భార్యా పిల్లలకు వారి నుండి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడట. మోహన్ బాబు, విష్ణు పేర్లను ఆయన పొందుపరచలేదట. మోహన్ బాబు మాత్రం రాచకొండ కమీషనర్ కి వాట్సప్ సందేశం ద్వారా ఫిర్యాదు చేశారట. మనోజ్, మౌనికల నుండి ప్రాణహాని ఉన్నట్లు ఆయన ఫిర్యాదులో వెల్లడించాడట.
కాగా మనోజ్ భార్యతో పాటు జుల్పల్లిలో నివాసం ఉంటున్నారు. అక్కడి నుండి మనోజ్ ని మోహన్ బాబు ఖాళీ చేయించాడట. మనోజ్ కి కూడా తండ్రి ఇంట్లో నివసించడం ఇష్టం లేకపోవడంతో ఇల్లు ఖాళీ చేశాడట. వాహనాలు రాగా సామాన్లు ఎక్కించారట. మీడియాతో మాట్లాడిన మనోజ్.. నా పోరాటం ఆస్తి కోసం డబ్బు కోసం కాదు. ఆత్మగౌరవం, నా భార్య పిల్లల రక్షణ కోసం. అందరినీ కలిసి న్యాయం అడుగుతాను, అన్నారు.
మనోజ్ పై మోహన్ బాబు, విష్ణు బాగా కోపంగా ఉన్నారని పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. గొడవలు చిలికి చిలికి గాలి వాన అయ్యాయి. తండ్రిని కొడుకు కొడితే.. కొడుకును కొట్టమని తండ్రి మనుషులను పంపాడు. మానవ సంబంధాలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో.. ఈ ఘటన తెలియజేస్తుంది.