
Balakrishna vs Ravi Teja : ఈ మధ్య పరిశ్రమలో రిలీజ్ డేట్స్ పంచాయితీలు ఎక్కువయ్యాయి. డిమాండ్ ఉన్న సీజన్ కోసం ఒకరికి ముగ్గురు హీరోలు పోటీపడుతున్నారు. తరచుగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. సంక్రాంతికి పెద్ద రచ్చ కాగా దసరాకు మరో వివాదం తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రవితేజ లాక్ చేసుకున్న డేట్ మీద బాలయ్య కన్నేశాడు. టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 20న పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
టైగర్ నాగేశ్వరరావు స్టూవర్టుపురం గజదొంగ బయోపిక్. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. పెద్దలను దోచి పేదలకు పంచిన టైగర్ నాగేశ్వరరావు ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచాడు. ఆయన జీవితం ఓ కమర్షియల్ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎప్పటి నుండో టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేటికి అది సాకారమైంది.
దసరా సీజన్ రిలీజ్ డేట్ గా ఎంచుకుని టైగర్ నాగేశ్వరరావు టీమ్ సగం సక్సెస్ అయ్యారు. అయితే బాలయ్య మధ్యలో వచ్చి మంట పెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 108వ చిత్ర విడుదలపై స్పష్టత ఇచ్చారు. దసరాకు విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీంతో టైగర్ నాగేశ్వరరావు మూవీ టీమ్ ఆగ్రహానికి గురవుతున్నారు. దసరా సీజన్ మీద ఖర్చీఫ్ వేస్తే మీరెలా ప్రకటిస్తారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే బాలకృష్ణ మూవీ మేకర్స్ దసరాకు విడుదల అన్నారు కానీ… స్పష్టమైన తేదీ ప్రకటించలేదు. టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న వస్తుండగా NBK 108 చిత్రాన్ని ఒకరోజు అటూఇటూ విడుదల చేసే అవకాశం కలదు. కాదు మేము కూడా అదే తేదీన వస్తామంటే క్లాష్ తప్పదు. దీంతో రవితేజను బాలయ్య గెలికాడని, ఇద్దరికీ విడుదల విషయంలో గొడవలయ్యేలా ఉన్నాయంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. మహేష్-చిరంజీవి సినిమాల విషయంలో ఇదే జరిగింది. SSMB 28 ఆగష్టులో ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయాలనున్నారు. ఆ డేట్ చిరు అధికారికంగా లాక్ చేశాడు. దీంతో మహేష్ మూవీ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది.