Homeజాతీయ వార్తలుPM Modi Degree Case: ఇలా అయితే మోడీ రిస్క్‌లో పడ్డట్టే?

PM Modi Degree Case: ఇలా అయితే మోడీ రిస్క్‌లో పడ్డట్టే?

PM Modi Degree Case
PM Modi Degree Case

PM Modi Degree Case: మనదేశంలో ఏదో ఒక అంశంపైన ప్రతిరోజూ వివాదం ఉండాల్సిందే. తాజా వివాదం ఏమిటంటే నరేంద్ర మోదీ విద్యార్హత. నిజానికి మోదీ ఏం చదువుకున్నారు అనే విషయంతో దేశానికి ఎలాంటి సంబంధం లేదు. మోదీ విద్యార్హతలతో దేశానికి వచ్చే లాభం కానీ, నష్టంకానీ ఏమీ లేదు. కానీ ఇపుడా అంశమే బాగా వివాదాస్పదం అవుతోంది. ఇదిలా ఉంటే.. మోదీ విద్యార్హతలు ప్రకటించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు మోదీ విద్యార్హతలు తెలుసుకోవాలని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కు రూ.25 వేలు జరిమానా విధించింది. దీంతో వివాదం ముదురుతోంది. మోదీ విద్యార్హతలు తెలుసుకోవాలని కోరితే ఫైన్‌ వేస్తారా అంటూ గోల మొదలైంది.

పెరుగుతున్న అనుమానాలు..
మోదీ విద్యార్హత విషయమై కేజ్రీవాల్‌ మాట్లాడుతూ గుజరాత్‌ హై కోర్టు తీర్పు తర్వాత మోదీ విద్యార్హతలపై అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయని అన్నారు. పట్నా యూనివర్సిటిలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటిలో పీజీ చదివిందే నిజమైతే మోదీ తన విద్యార్హతలను ఎందుకని బహిర్గతం చేయటంలేదని నిలదీస్తున్నారు. నిజానికి మనదేశంలో ప్రజాప్రతినిధులకు విద్యార్హతలతో పనిలేదు. రాయటం, చదవని వాళ్లు కూడా అత్యున్నత పదవులను పొందవచ్చు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే ముందు దాఖలు చేసే అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తేనే ప్రాబ్లెమ్‌ వస్తుంది. ఇపుడు కేజ్రీవాల్‌ ఆరోపణల ప్రకారం మోదీ తన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారట. గుజరాత్‌ హైకోర్టు తీర్పు తర్వాత దేశంలోని చాలామంది ప్రముఖులు తమ డిగ్రీ సర్టిఫికేట్లను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే మోదీ మాత్రం దీనిపై స్పందించడం లేదు.

కేటీఆర్‌ కూడా..
కేంద్రంతో పోరాటం చేస్తున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ కూడా తన డిగ్రీ సర్టిఫికేట్లను ప్రకటించారు. నెటిజన్లు కూడా డిగ్రీ సర్టిపికేట్లతో సోషల్‌ మీడియాను హోరెత్తించేస్తున్నారు. అంటే ఒకరకంగా ఇది మోదీపై మైండ్‌ గేమ్‌ అనే అనుకోవాలి. కోర్టు తీర్పును కాదని, సోషల్‌ మీడియా ద్వారా ప్రధానిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. దీంతో బీజేపీ ఇరకాటంలో పడింది. కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు.

PM Modi Degree Case
PM Modi Degree Case

విపక్షాలు మొదలు పెట్టిన మైండ్‌ గేమ్‌ రాజకీయ పార్టీలు, నేతలకే పరిమితం కాలేదు. దీంతో సామాన్య జనాలు కూడా చేరటమే గమనార్హం. దీంతో మోదీని టార్గెట్‌ చేయాలనుకున్న విపక్షాల వ్యూహానికి సమాన్యులే అడ్డుగా మారారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular