Modi Birthday 2022: శీర్షిక చదివి.. ఇదేంటి ఇలా రాశారు అనుకోకండి. మేం రాసింది కరెక్టే. మీరు చదివిందీ కరెక్టే. అయితే అసలు విషయం ఏంటో చదవండి.. మీకే తెలుస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వేడుకలు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రధానమంత్రి మోడీపై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఆర్డోర్ 2.0 రెస్టారెంట్ ప్రధానమంత్రి మోడీ జన్మదిన సందర్భంగా తమ వినియోగదారులకు సూపర్ డూపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకమైన థాళి ( భోజనం) సిద్ధం చేసింది. ఈ రెస్టారెంట్ ఆఫర్ చేస్తున్న భోజనంలో 56 రకాల వంటకాలు ఉన్నాయి. వినియోగదారులకు ఇక్కడ మరో ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే వెజ్, నాన్ వెజ్.. ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు.
Also Read:
Senior NTR- Pawan Kalyan: నాడు ఎన్టీఆర్.. నేడు పవన్ కళ్యాణ్.. అదే ‘చైతన్య రథం’ సెంటిమెంట్ యాత్ర

రెస్టారెంట్ యజమాని సుమిత్ కలారా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశానికి గర్వకారణం అన్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని 56 అంగుళాల మోడీజీ పేరుతో గ్రాండ్ భోజనాన్ని సిద్ధం చేశామని చెప్పారు. నిజానికి ఈ భోజనాన్ని మోడీకి బహుమతిగా ఇవ్వాలని రెస్టారెంట్ యజమాని భావించారు. తన రెస్టారెంట్ కు మోదీ వస్తే బాగుంటుందని సుమిత్ కోరుకున్నారు. అయితే భద్రతపరమైన కారణాలు అందుకు అంగీకరించవు. కాబట్టే ఈ భోజనాన్ని ఆస్వాదించేందుకు ఆయన అభిమానులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్టు సుమిత్ తెలిపారు. ఈ గ్రాండ్ భోజనాన్ని పూర్తి చేసిన వారికి 8.5 లక్షల బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. మోడీ బర్త్డే అయిన 17 నుంచి 26 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సుమిత్ తెలిపారు. ఒక్కరైనా, జంటలుగానైనా రావచ్చని వివరించారు. లక్కీ డ్రా లో గెలిచిన వారికి ప్రధానమంత్రి కి అత్యంత ఇష్టమైన కేదార్నాథ్ ఉచిత ట్రిప్ కూడా ఉంటుందని పేర్కొన్నారు.

కేవలం ఆయన అభిమానులే కాకుండా మోడీ జన్మదినోత్సవాన్ని సేవాపఖ్వారా తో పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శరణులకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇప్పటికే కార్యక్రమ వివరాలు పంపించారు. శనివారం నుంచి మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 వరకు ఈ సేవ పఖ్వారా కొనసాగుతుంది. అంతేకాకుండా “మోడీ@ 20 స్పాన్ హ్యూ సర్కార్” అనే పుస్తకాన్ని బిజెపి ప్రమోట్ చేయనుంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో చిరుత పులుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు
Also Reag:AP Capital Visakha: విశాఖ రాజధాని వచ్చే ఏడాదే… బిల్లు లేదు…ఎలా సాధ్యమబ్బ?
[…] Read: Modi Birthday 2022: 56 అంగుళాల మోదీని తింటే ఈ 8.5 లక్ష… కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఇలాంటి […]