
MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు. కల్వకుంట్ల వారసురాలు.. బతుకమ్మ బ్రాండ్ అంబీసిడర్‌గా చెప్పుకు కల్వకుంట్ల కవిత మూడో విడత ఈడీ ఇంటరాగేషన్‌కు మంగళవారం వెళ్లారు. ఇప్పటికే ఈనెల 11న, 20న ఈడీ విచారణకు వెళ్లారు కవిత. ఈనెల 16న వ్యక్తిగతంగా రావాలని నోటీసుల్లో పేర్కొనేలదని డుమ్మాకొట్టారు. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని, అప్పటి వరకు పిలవొద్దని తన న్యాయవాది ద్వారా లేఖ పంపించారు. కానీ, ఈడీ 20న విచారణకు పిలిచింది. సోమవారం సుమారు పదిన్నర గంటలపాటు కవితను విచారణ చేసిన ఈడీ అధికారులు మంగళవారం మళ్లీ రావాలని పిలిచారు.
ఫోన్లతో ఈడీ ఆఫీస్‌కు..
ఇక కవిత పది ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ గతంలో రామచంద్రపిళ్లై, బుచ్చిబాబుతోపాటు పలువురిపై ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. కవిత కూడా ఫోన్ల ధ్వంసం చేయలేదని ఎక్కడా పేర్కొనలేదు. ఈడీ ఆరోపణలను ఖండించలేదు. ఈ క్రమంలో సోమవారం జరిగిన విచారణలో ఈడీ అధికారులు కవితను మంగళవారం ఫోన్లు తీసుకురావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి ఈడీ విచారణకు బయల్దేరిన కవిత, తాను ధ్వంస చేశానని ప్రచారం జరుగుతున్న ఫోన్లను బయటకు వచ్చాక ప్రదర్శించారు. సదరు ఫోన్లపై తెల్లకాగితంతో రాసిన ఐఎంఏ నంబర్లు కూడా ఉన్నాయి. దీంతో తాను ఫోన్లు ధ్వంసం చేయలేదనే సందేశాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి పంపించారు.
ఫోన్లపైనే థర్డ్ ఇంటరాగేషన్..
కవిత ధ్వంసం చేసినట్లు ఈడీ చెబుతున్న ఫోన్లను కవిత విచాణకు తీసుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మూడో రోజు జరిపే ఇంటరాగేషన్ పూర్తిగా ఫోన్ల వినియోగం, ధ్వంసంపైనే జరుగనున్నట్లు తెలుస్తోంది. అందుకే కవితను ఈడీ అధికారులు ఫోన్లు తీసుకురావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. విచారణకు వెళ్లిన మొదటి రోజు కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ను ఈడీ అధికారులు ఇంటి నుంచి తెప్పించి స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పాత 9 ఫోన్లు తీసుకు రావాలని ఆదేశించారు. దీంతో మంగళవారం కవిత ఫోన్లతో విచారణకు వెళ్లారని సమాచారం.

గోప్యతకు భంగం అంటూ గగ్గోలు..
ఇదిలా ఉండగా కవిత విచారణకు వెళ్లిన 15 నిమిషాలకు కవిత రాసిన లేఖను బీఆర్‌ఎస్ వర్గాలకు మీడియాకు రిలీజ్ చేశాయి. ఈ లేఖను ఈడీ అధికారి జోగేందర్‌కు రాసినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా తాను ఫోన్లను ధ్వసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. తన వివరణ కూడా తీసుకోకుండా ఫోన్లు ధ్వసం చేశానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దురుద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇక మహిళను అయిన తన ఫోన్లను స్వాధీనం చేసుకోవడం, అడగడం తన గోప్యతకు భంగం కలిగించినట్ల కాదా అని లేఖలో ప్రశ్నించారు. తన ఫోన్ల ఐఎంఈ నంబర్లు బహిరగతం చేయడాన్ని తప్పు పట్టారు. ఈడీ ఆరోపణతో తాను రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కొన్నానని తెలిపారు.
అయితే గత నవంబర్ నుంచి ఈడీ ఫోన్లు ధ్వసం చేసిందని ఆరోపిస్తోంది. ఐదు నెలలుగా ఈవిషయంలో కవిత మౌనంగా ఉన్నారు. ఈడీ ఆరోపణలను ఖండించలేదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలోనూ ఫోన్లు ఉన్నాయని మాత్రమే చెప్పారు. కానీ విచారణలో ఈడీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుండడంతో మంగళవారం ఈడీ విచారణకు వెళ్తూ ఫోన్లు ప్రదర్శించడమే కాకుండా, ఇప్పుడు తన గోప్యతకు భంగం కలిగించారని లేఖ విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.