
Mahesh Babu: మహేష్ బాబు మూవీ మేకర్స్ చావు కబురు చల్లగా చెప్పారు. ఎస్ఎస్ఎంబి 28 నుండి ఎలాంటి అప్డేట్ లేదంటూ అధికారికంగా వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. మహేష్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఒక షెడ్యూల్ లగ్జరీ హౌస్ సెట్లో పూర్తి చేశారు. అక్కడ హీరో, హీరోయిన్ తో పాటు ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. సమ్మర్ చివరి కల్లా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు.
ఈ చిత్ర షూటింగ్ కోసమే మహేష్ ఫ్యామిలీ టూర్ కి కూడా వెళ్ళలేదు. ఆయన భార్య నమ్రత ఇద్దరు పిల్లలతో విదేశాలకు వెళ్లడం జరిగింది. మహేష్ ఫస్ట్ టైం తాను లేకుండా ఫ్యామిలీని టూర్ కి పంపారు. ఆగస్టు నెలలో మూవీ విడుదల చేయాలనే టార్గెట్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ జరిపారు. ఈ క్రమంలో ఉగాది కానుకగా బ్లాస్టింగ్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.
ఉగాది కానుకగా మహేష్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఫాన్స్ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లింది యూనిట్. ఉగాదికి ఎలాంటి అప్డేట్ లేదని చెప్పకనే చెప్పారు. ‘మహేష్ మూవీ అప్డేట్ కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుస్తుంది. అయితే అప్డేట్ ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అదిరిపోయే ట్రీట్ ఇస్తామంటూ… అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. నిర్మాణ సంస్థ ఇచ్చిన షాక్ కి ఫ్యాన్స్ నీరసపడ్డారు.

అటు మహేష్-రాజమౌళి మూవీ నుండి కూడా అప్డేట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళి ఇంకా ఆర్ ఆర్ ఆర్ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారు. కాగా త్రివిక్రమ్ మార్క్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారట. మహేష్ లుక్ అండ్ క్యారెక్టర్ మాత్రం సరికొత్తగా డిజైన్ చేశారట. మహేష్ అవతార్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇవ్వడం ఖాయమంటున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్. నటుడు జయరామ్ ఈ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Hey Superfans, we share your anticipation & excitement for #SSMB28! The wait for the Superstar's Mass feast will be well worth it, we promise🤩
Keep an eye out for the announcement at the perfect time🏹🔥 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @NavinNooli @vamsi84
— Haarika & Hassine Creations (@haarikahassine) March 20, 2023