Homeట్రెండింగ్ న్యూస్MLC Kavitha Letter: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు.. కవిత ఆరోపణల వెనుక కథ!

MLC Kavitha Letter: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు.. కవిత ఆరోపణల వెనుక కథ!

MLC Kavitha Letter: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవిత. 20 రోజుల క్రితం ఆమె కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ రెండు రోజుల క్రితం బయట పడింది. ఇందులో పాజిటివ్, నెగెటివ్‌ అంటు అంశాలను కవిత ప్రస్తావించారు. ఆరు పేజీల్లో రెండు పేజీలే పాజిటివ్‌గా ఉన్నాయి. నాలుగు పేజీల్లో నెగెటివ్‌ అంశాలే. ఇక ఈలేఖ కవిత అమెరికా నుంచి తిరిగి వస్తున్న ఒక రోజు ముందే లీక్‌ కావడం గమనార్హం. ఇది కవితే కావాలని లీక్‌ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం భారత్‌కు వచ్చిన కవిత తన లేఖపై స్పందించారు.

శుక్రవారం(మే 23న) సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న కవిత.. ఎయిర్‌పోర్టు బయట మీడియాతో మాట్లాడారు. తన లేఖపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. రెండు వారాల క్రితం లేఖ రాసినట్లు అంగీకరించారు. ఇదే సమయంలో కేసీఆర్‌ను దేవుడితో పోల్చారు. అయితే ఆయన చుట్టూ ‘దెయ్యాలు‘ ఉన్నాయని, ఈ దెయ్యాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నేతల్లో సంచలనంగా మారాయి.

కవిత లేఖ లీక్‌
కవిత ఈ ఆరోపణలు, ఆమె తన తండ్రి కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ బహిర్గతమైన తర్వాత వెలువడ్డాయి. ఈ లేఖలో కవిత, ఏప్రిల్‌ 27, 2025న వరంగల్‌లో జరిగిన ఆఖ సిల్వర్‌ జుబ్లీ BRS తర్వాత పార్టీ వ్యూహంపై సానుకూల, ప్రతికూల అంశాలను పేర్కొన్నారు.

కేసీఆర్‌ స్పీచ్‌లో బీజేపీ విమర్శలు తక్కువ: కేసీఆర్‌ తన వరంగల్‌ సభా భాషణలో బీజేపీపై కేవలం రెండు నిమిషాలు మాత్రమే విమర్శించారని, ఇది BRS భవిష్యత్తులో బీజేపీతో జట్టు కట్టవచ్చనే ఊహాగానాలకు దారితీసిందని కవిత లేఖలో పేర్కొన్నారు.

MLC ఎన్నికల నిర్ణయం: హైదరాబాద్‌ లోకల్‌ అథారిటీస్‌ కాన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేయకపోవడం పార్టీ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపిందని కవిత విమర్శించారు.

పాత నాయకులను పట్టించుకోకపోవడం: 2001 నుంచి పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులకు వరంగల్‌ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, కేసీఆర్‌ ఉర్దూ మాట్లాడకపోవడం, వక్ఫ్‌ చట్టం, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్‌ వంటి కీలక అంశాలను ప్రస్తావించకపోవడంపై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ లేఖ బహిర్గతం కావడంతో, కవిత ఈ లీక్‌ వెనుక ‘కుట్ర‘ ఉందని, ఈ కుట్రలో పాల్గొన్నవారిని ‘దెయ్యాలు‘గా సూచించారు. ఈ దెయ్యాలు ఎవరై ఉండవచ్చు అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేసింది.

‘దెయ్యాలు‘ ఎవరు?
కవిత స్పష్టంగా ఎవరిని ఉద్దేశించి ‘దెయ్యాలు‘ అని పేర్కొన్నారో పేర్లు చెప్పలేదు, కానీ ఈ ఆరోపణల వెనుక ఉన్న సందర్భం, పార్టీలోని అంతర్గత రాజకీయాలు కొన్ని అనుమానాలకు దారితీశాయి.

పార్టీలోని కొందరు సీనియర్‌ నాయకులు: కవిత లేఖలో పాత నాయకులకు అవకాశాలు ఇవ్వకపోవడంపై విమర్శలు చేశారు. కొందరు సీనియర్‌ నాయకులు లేఖ లీక్‌లో పాల్గొని ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. వీరు పార్టీలో కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాలతో అసంతృప్తిగా ఉండి, కవిత లేఖను బహిర్గతం చేసి పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసి ఉండవచ్చు.

కేటీఆర్‌ ఆధిపత్యం: కవిత సోదరుడు, BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు (కేటీఆర్‌)ను కేసీఆర్‌ తన వారసుడిగా ప్రమోట్‌ చేస్తున్నారనే స్పెక్యులేషన్స్‌ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత అసంతృప్తితో ఉండవచ్చని, ఆమె ఆరోపణలు కేటీఆర్‌ లేదా ఆయన సన్నిహిత వర్గాలను ఉద్దేశించి ఉండవచ్చని ఊహిస్తున్నారు.

హరీశ్‌రావు : ఇక బీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావు కూడా నంబర్‌ 3 పొజీషన్‌లో ఉన్నారు. ఆయితే ఆయన కూడా కొంతకాలంగా కేసీఆర్‌ తీరుపై అసంతృప్తితోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో లేఖను హరీశ్‌రావు లేదా ఆయన అనుచరులు లీక్‌ చేసి ఉంటారని సమాచారం.

జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి.. ఇక కేటీఆర్, హరీశ్‌రావు తర్వాత కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు, మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగీశ్‌రెడ్డి. వీరిపైన కూడా కవిత అనుమానాలు వ్యక్తం చేశారా అన్న చర్చ జరుగుతోంది.

మొత్తంగా కవిత చెప్పిన దెయ్యాల జాబితాలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌డ్డి, ప్రశాంత్‌రెడ్డితోపాటు ఇంకా ఎవరెవరు ఉన్నారన్న చర్చ తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో, బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో విస్తృతంగా జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version