Hydra Public opinion : ఇక్కడితో హైడ్రా గనక మంచి అడుగులు వేసి ఉంటే బాగుండేది. కానీ కూల్చివేతల విషయంలో.. ఆక్రమణల తొలగింపు విషయంలో హైడ్రా పెద్దలను వదిలిపెట్టడం వివాదంగా మారింది. ఇక భారత రాష్ట్ర సమితి అయితే నెగిటివ్ ప్రచారాన్ని జోరుగా చేయించింది. సాక్షాత్తు హైడ్రా అధిపతి కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. న్యాయమూర్తి చేతిలో తిట్లు తినాల్సి వచ్చింది. ఇక దీనికి తోడు భారత రాష్ట్ర సమితి చేసిన నెగిటివ్ ప్రచారం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఒకానొక దశలో హైడ్రా అనే వ్యవస్థను ఎత్తివేయాలని భారత రాష్ట్ర సమితి ధర్నాలు, నిరసనలు చేపట్టింది.. అయితే రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు.. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి హైడ్రానే కారణమనే జరుగుతున్న ప్రచారాన్ని సైతం తట్టుకుని రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చారు. హైడ్రాకు మరింత జవసత్వాలు కల్పించడానికి శాశ్వతమైన పోలీస్ స్టేషన్ నిర్మాణం.. ఉద్యోగుల కేటాయింపు.. వాహనాల కేటాయింపు వంటి చర్యలు తీసుకున్నారు.
దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు ప్రస్తుతం వరదలతో నరకం చూస్తోంది. దీనికి ప్రధాన కారణం నీటి వనరుల ఆక్రమణ. అలాంటి పరిస్థితిని హైదరాబాద్ కూడా ఇటీవల కాలంలో చవిచూసింది. ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని భావించిన ప్రభుత్వం హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఆరోపణలను, విమర్శలను పక్కనపెట్టి దూకుడుగా వెళ్లాలని హైడ్రాకు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం హైడ్రా ఆక్రమణల విషయంలో.. అతిక్రమణల విషయంలో ఏమాత్రం సహించడం లేదు. పైగా అక్రమ నిర్మాణాలను పడగొడుతోంది. తద్వారా సగటు హైదరాబాద్ పౌరుడి మన్ననలు పొందుతోంది. హైడ్రా ఆక్రమణలు లేని హైదరాబాద్ నగరం కోసం తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ విభాగాన్ని రంగనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి.. వాటికి సంబంధించిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి హైడ్రా రంగంలోకి దిగుతోంది. అంతేకాదు ముందుగా నోటీసులు ఇస్తోంది. ఆ తర్వాత ఎటువంటి కోర్టు వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తపడి.. కూల్చివేతలు చేస్తోంది.
Also Read : జూబ్లీహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు
జూబ్లీహిల్స్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా
— కిరాయికి వచ్చి నాలాతో పాటు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు
— రెండెకరాల పార్కుకు దారి లేకుండా చేసిన కిరాయిదారుడు
— అక్రమ నిర్మాణాలను తప్పు పట్టిన హై కోర్టు
— కోర్టు అనుమతులతో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా… pic.twitter.com/73L8E0Kc1r— HYDRAA (@Comm_HYDRAA) May 23, 2025
ఇటీవల అమీన్పూర్ చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ పీర్జాదిగూడలో బహుళ అంతస్తులు నిర్మిస్తే.. వాటిని పడగొట్టింది. ఇక ఖరీదైన బంజరా హిల్స్ లాంటి ప్రాంతంలో పార్కుకు వెళ్లేదారిని ఆక్రమించి.. ఏకంగా హాస్టల్, ఇతర నిర్మాణాలు చేపట్టిన ఓ వ్యక్తిపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంది. ఆ నిర్మాణాలను చూస్తుండగానే పడగొట్టింది. ఇక మదినగూడ ప్రాంతంలో నాలాను ఆక్రమించి ఓ వ్యక్తి కఠిన నిర్మాణాన్ని హైడ్రా పడగొట్టింది. ఇప్పటివరకు దాదాపు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను రక్షించామని హైడ్రా చెబుతోంది. జూబ్లీహిల్స్ లో చేపట్టిన ఆపరేషన్ ద్వారా 200 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని రక్షించామని హైడ్రా వివరిస్తున్నది. ఇక చెరువులను, నాలాలు, కుంటలు వంటి వాటిని పరిరక్షిస్తున్నామని.. అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు రావడమే ఆలస్యం.. పూర్తి వివరాలు తెలుసుకొని నేరుగా రంగంలోకి దిగుతున్నామని హైడ్రా అధిపతి రంగనాథ్ చెబుతున్నారు.. మొత్తంగా మనోడు దాకా సగటు హైదరాబాది మదిలో హైడ్రా మీద నెగిటివ్ అభిప్రాయం ఉంటే.. ఇప్పుడు మాత్రం అది పాజిటివ్గా మారింది. మొత్తంగా భారత రాష్ట్ర సమితి నుంచి తీవ్రమైన ఉక్కపోతను ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డికి ఈ పరిణామం కాస్త రిలీఫ్ ఇస్తోంది. అంతేకాదు ఇన్నాళ్లపాటు చెరువులను, ఇతర నీటి వనరులను ఆక్రమించిన దుర్మార్గులకు ప్రభుత్వం నుంచి చెంపపెట్టు లాంటి సమాధానం లభిస్తుందనే అభిప్రాయం సగటు హైదరాబాది నగర వాసిలో కలుగుతోంది.
ఫిర్జాదిగూడలో సంబరాలు
హైడ్రా పనితీరుపై ప్రశంసలు
సహఫంక్తి భోజనాలు.. టపాసులు పేల్చి వేడుకలుఫిర్జాదిగూడలో పండగ వాతావరణం కనిపించింది. కబ్జాల చెర నుంచి దాదాపు 2 ఎకరాల మేర ఉన్న గ్రేవ్యార్డును కాపాడుకున్నామని అక్కడి వారు పండగ చేసుకున్నారు. టెంటులు వేసి సహఫంక్తి… pic.twitter.com/OKjnwvcZIV
— HYDRAA (@Comm_HYDRAA) May 23, 2025